
అమరావతి: పదో తరగతి ముగించుకుని అప్పుడే కాలేజీ(Inter College)లో అడుగు పెట్టింది. కొత్త పరిచయాలు, కొత్త ప్రాంతం అంతా ఉల్లాసంగా సాగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఆమె చదువుతున్న కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ మాత్రం మనసులో కపటంతో మెదులుతున్నాడు. ఆమెకు ఫిజిక్స్ బోధిస్తూ మెల్లగా ఆమెను ముగ్గులోకి దించాడు. ఫిజిక్స్ పాఠాలకు బదులు ప్రేమ పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడే ఇంటర్‌లో అడుగు పెట్టిన ఆ విద్యార్థిని లెక్చరర్ మాటలను విశ్వసించింది. అంతేకాదు, ఏకంగా తల్లి దండ్రుల మాటలనూ ఖాతరు చేయలేదు. రమ్మని పిలిచిన ఫిజిక్స్ లెక్చరర్ చేయి పట్టుకుని నడిచింది. విద్యార్థిని(Student) తన మాటల మాయలో పడటంతో ఆమెను తీసుకుని ఫిజిక్స్ లెక్చరర్ జంప్ అయ్యాడు. ఈ ఘటన Andhra Pradesh లోని తిరుపతిలో చోటుచేసుకుంది.
తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాలేజీకి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఆ విద్యార్థిని జాయిన్ అయింది. ఆమెకు ఫిజిక్స్ పాఠాలు చెప్పకుండా మెల్లగా లవ్ ట్రాక్‌లోకి దింపాడు అక్కడే ఫిజిక్స్ చెబుతున్న కార్తికేయ లెక్చరర్. ఆ లెక్చరర్ మాటలను విద్యార్థిని నమ్మింది. ప్రేమించింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు విపరీతంగా పెరిగాయి. ఇంట్లో కూతురు తరుచూ ఫోన్లు మాట్లాడటాన్ని తల్లిదండ్రులు గమనించారు. తమ కూతురు ఎవరో పోకిరి చెప్పే మాయ మాటల్లో చిక్కుకుందని అనుమానించారు. అందుకే ఆమెను మందలించారు.
Also Read: కీచక లెక్చరర్లు.. పార్టీకి పిలిచి విద్యార్థినిపై అమానుషం...
ప్రేమ అంటూ తప్పుదారి తొక్కవద్దని, శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని హిత బోధ చేశారు. కెరీర్ నాశనం చేసుకోవద్దని చెప్పారు. అనంతరం ఆమె సరిగానే నడుచుకుంటుందని తల్లిదండ్రులు భావించారు. ఎప్పటిలాగే ఆమెను మరుసటి రోజు కాలేజీకి పంపారు. కానీ, ఆమె ఆ రోజు సాయంత్రం మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు గాబరా పడ్డారు. తమ కూతురుకు ఏమైందా? అనే ఆందోళనలో పడ్డారు. వెంటనే పరుగున కాలేజీకి వెళ్లారు. అక్కడ ఆమె తోటి విద్యార్థులు చెప్పిన మాటలు విని ఖంగు తిన్నారు. ఫిజిక్స్ లెక్చరర్ కార్తికేయ ఆమెతో కలిసి మాట్లాడారని వివరించారు. వారిద్దరూ కలిసి పారిపోయారని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు షాక్ తిన్నారు.
Also Read: తల్లి లెక్చరర్.. స్టూడెంట్ కి కన్నేసిన కొడుకు.. చివరకు
ఇదే విషయాన్ని తీసుకుని కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. కానీ, అక్కడి నుంచి సానుకూల సమాధానం రాలేదు. నిర్లక్ష్యంగా సమాధానాలు రావడంతో చేసేదేమీ లేక వారు వెనుదిరిగారు. అటు నుంచి వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కానీ, పోలీసు నుంచి కూడా వారు ఆశించిన స్పందన రాలేదని బాధితులు చెప్పారు. వారి కుమార్తె అదృశ్యమై అప్పటికే నాలుగు రోజులు గడిచింది. ఇంకా ఎవరిని ఆశ్రయించాలో.. తెలియక తలలు పట్టుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఇతర బంధువులతో కలిసి తిరుపతి చుట్టు పక్కల వారి కుమార్తె కోసం గాలింపులు చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఓ మహిళ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. కాగా.. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతను తన తల్లి దగ్గర చదువుకునే ఓ యువతిపై కన్నేశాడు. తొలుత స్నేహం పేరిట దగ్గరయ్యాడు. ఆ తర్వాత మోసం చేశాడు.