ఆమె ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. ఆమె వద్ద ఎంతో మంది స్టూడెంట్స్ చదువు నేర్చుకున్నారు. అలా.. ఆమె దగ్గర చదువు  నేర్చుకుంటున్న ఓ విద్యార్థిని పై ఆమె కొడుకు కన్ను పడింది. తల్లి కోసం అనే వంకతో ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. ఆ స్నేహాన్ని ప్రేమగా నమ్మించాడు. చివరకు తన కోరిక తీర్చుకొని వదిలేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఓ మహిళ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. కాగా.. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతను తన తల్లి దగ్గర చదువుకునే ఓ యువతిపై కన్నేశాడు. తొలుత స్నేహం పేరిట దగ్గరయ్యాడు. దాదాపు మూడు సంవత్సరాలుగా వారిద్దరికీ పరిచయం ఉంది. 

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో పలుమార్లు శృంగారంలో కూడా పాల్గొన్నాడు. ఆమెకు రెండు, మూడుసార్లు గర్బం కూడా దాల్చింది. అయితే... బలవంతంగా అబార్షన్ చేయించాడు. తర్వాత పెళ్లిఅంటే కాదు పొమ్మన్నాడు. దీంతో.. బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించడంతో.. అతనిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.