రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ల ధాటికి (ap floods) వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైన సంగతి తెలిసిందే. దీంతో రైతుల్లో భరోసా కల్పించడంతో పాటు వారికి పంట నష్ట పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది తెలుగుదేశం పార్టీ
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ల ధాటికి (ap floods) వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైన సంగతి తెలిసిందే. రైతులు అన్ని రకాలుగా నష్టపోగా.. భారీగా పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం సైతం సంభవించింది. వేలసంఖ్యలో పశువులు కొట్టుకుని పోయాయి. ఈ రోజు వరకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. పరిహారం లెక్కింపు ఇంతవరకు పూర్తి కానేలేదు. ఇన్ పుట్ సబ్సీడీ రైతులకు అందలేదు. ఈ ఏడాది పంట బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఈ నేపథ్యంలో ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన మిరప పంట దెబ్బతినడంతో రైతులు (red chilli farmers) దిగాలు పడ్డారు.
దీంతో రైతుల్లో భరోసా కల్పించడంతో పాటు వారికి పంట నష్ట పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది తెలుగుదేశం పార్టీ (telugu desam party) . ఈ కమిటీ ఈ నెల 18,19,20 తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుని వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ నెల 18వ తేదీన కృష్ణా, 19న గుంటూరు, తూర్పు ప్రకాశం, 20వ తేదీ పశ్చిమ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కమిటీ సభ్యులు పర్యటించనున్నారు.
undefined
ALso Read:‘బొసిడికే’ ఏపీ రాజకీయాల్లో ఈ ఏడాది మార్మోగిన పదం..
ఈ కమిటీలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితో ( mareddy srinivas reddy) పాటు తెలుగురైతు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు కొండ్రుకుంట వెంకయ్య, నర్సరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బి.ఆదిశేషారెడ్డి, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుర్రా నరేంద్ర, బొంతు శివసాంబిరెడ్డి, నక్కల అగష్టిన్ బాబు తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు, పమిడి భాస్కర్ రావు, తెలుగురైతు రాష్ట్ర నాయకులు మేకా శివరామకృష్ణ, కొఠారు ప్రసాద్, గొట్టిపాటి జనార్థన్ బాబు, కోమటినేని శ్రీనివాసరావు, జడా లక్ష్మయ్య, కాకర్ల కోటయ్య, ఆవులూరి యలమంద, సీఎస్ నారాయణరెడ్డి తదితరులు వుంటారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.