అఖిలప్రియకు హోం మంత్రి చినరాజప్ప హెచ్చరిక

Published : Jan 09, 2019, 11:50 AM IST
అఖిలప్రియకు హోం మంత్రి చినరాజప్ప హెచ్చరిక

సారాంశం

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియపై ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఖిలప్రియ ఇంకా చాలా తెలుసుకోవాలని సూచించారు. ఇటీవలే భూమా అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కి పింపించి వేశారు. 

అమరావతి: ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియపై ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఖిలప్రియ ఇంకా చాలా తెలుసుకోవాలని సూచించారు. ఇటీవలే భూమా అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కి పింపించి వేశారు. 

ఆమెతోపాటు సోదరుడు భూమా బ్రహ్మాంనందరెడ్డి సైతం గన్ మెన్లను తిరస్కరించారు. ఈ పరిణామాలపై హెం మంత్రి చినరాజప్ప స్పందించారు. పార్టీలో కానీ ఇతర అంశాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకురావాలని అంతేకానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదని ఆయన సూచించారు. 

ప్రస్తుతానికి భూమా అఖిలప్రియ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లిందని ఆయనే సమస్యను పరిష్కారిస్తారని చెప్పుకొచ్చారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని దాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి చినరాజప్ప.  
 

ఈ వార్తలు కూడా చదవండి

చెల్లెలు బాటలో అన్న.. భద్రత వెనక్కి

పోలీసులపై అలక.. మంత్రి అఖిలప్రియ వివరణ

అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ

మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?