కాలేజీ ఆడపిల్లల బాత్ రూముల్లో హిడెన్​ కెమెరాలు.. తల్లిగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది : వైఎస్ ష‌ర్మిల

Published : Aug 30, 2024, 05:03 PM ISTUpdated : Aug 30, 2024, 05:44 PM IST
కాలేజీ ఆడపిల్లల బాత్ రూముల్లో హిడెన్​ కెమెరాలు.. తల్లిగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది :  వైఎస్ ష‌ర్మిల

సారాంశం

Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు ఇంజినీర్ కాలేజీ హాస్టల్ లో ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలు (హిడెన్​ కెమెరాలు) కనిపించడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  విద్యార్థులు హాస్టల్ ను వ‌దిలి నిందితులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నినాదాలు చేశారు. ఈ ఘటన ఒక ఆడబిడ్డ తల్లిగా త‌న‌ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల అన్నారు.   

Hidden Cameras In Hostel: ఆడపిల్లల హాస్ట‌ల్ బాత్ రూముల్లో కొందరు దుండగులు స్పై కెమెరాలు ఏర్పాటు చేశారనీ, వంద‌లాది వీడియోలు ఇత‌రుల‌తో పంచుకున్నార‌ని ఆరోపిస్తూ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల (జీఈసీ) విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ హిడెన్ కెమెరాల అంశం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను షేక్ చేస్తోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి శుక్రవారం నుంచి ఆందోళ‌న‌కు దిగారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించింది.

ఈ క్ర‌మంలోనే  గుడ్లవల్లేరు ర‌హ‌స్య కెమెరాల విష‌యంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆడబిడ్డ తల్లిగా త‌న‌ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోందని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డ‌ల‌ను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని మండిప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన ష‌ర్మిల.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. "ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే... వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం" అని పేర్కొన్నారు.

IPL 2025: రోహిత్ శర్మ కోసం 50 కోట్లు.. లక్నో సూపర్ జెయింట్స్ ఏం చేస్తుందో తెలుసా?

అలాగే, కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యంగా ఈ ఘ‌ట‌న‌ను పేర్కొన్నారు. "యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలి. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలి. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని" ష‌ర్మిల డిమాండ్ చేశారు. 

"రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా. విద్యార్థినిలతో మాట్లాడుతా. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని" వైఎస్ ష‌ర్మిల పేర్కొన్నారు. 

Rohit Sharma : ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డ్...

 

 

వందల మంది ప్లేయర్లతో ఆడినా బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఎందుకు ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాయి? 

PREV
Read more Articles on
click me!