ఏపీలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో గల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమేరాలు అమర్చడం కలకలం రేపింది. ఇవి బయటపడటంతో అర్ధరాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వాష్ రూమ్స్‌లో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారని.. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Hidden cameras discovered in a girls' hostel at a Krishna District engineering college: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల్లో నిత్యం ఏదో ఒక దుర్ఘటన చోటు చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో విద్యా సంస్థలు, వసతి గృహాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరో ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం రేపాయి. దీంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. గల్స్ హాస్టల్ వాష్ రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి.. తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు.
కాగా, ఈ వ్యవహారంతో అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థికి సంబంధం ఉందని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో... కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై.... సహచర విద్యార్థులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పలువురు జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థికి చెందిన ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా యాజమాన్యం స్పందించడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
undefined
మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సూచించారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. ‘‘కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి...’’ అని ఆదేశించారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా…
— Lokesh Nara (@naralokesh)