ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: బీజేపీ, జనసేన పొత్తుకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీనేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.గురువారం నాడు రాత్రి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Also read:టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్
undefined
జనసేన బీజేపీ పొత్తు వారి వ్యక్తిగత విషయమని ఆయన చెప్పారు. 6 నెలల్లోనే విపక్షాలు మొత్తం ఒకే తాటిపై తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికగా అమరావతి ని రాజధాని గా ఉంచాలని డిమాండ్ చేస్తూ పొరాటం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Also read:అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా
151 మంది MLA లు ఉన్న ఇంత అభద్రతా భావంలో ఏ ముఖ్యమంత్రి ఉండడని చెప్పారు రాష్ట్ర చరిత్రలో ఇంత దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.బీజేపీ నాయకులు టీడీపీ కి గేట్లు మూసివేసినట్టుగా చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. బీజేపీని పొత్తు కోసం ఎవరు అడిగారని పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. వైసీపీ నాయకుల పిచ్చి ప్రేలాపణలు మానుకొని తక్షణమే అమరావతి ని రాజధాని గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్
Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా
also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
అమరావతి తరలింపు ఆపడమే మా ధ్యేయం: వర్ల రామయ్య
రాజధానిని అమరావతి నుండి తరలింపును ఆపడం టీడీపీ ముందున్న తక్షణ కర్తవ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తర్వాత వర్ల రామయ్య మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
also read:బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్
Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నంద
Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు
Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి
ఈ విషయంలో టీడీపీ, జనసేనలు కూడ కలిసి రావాలని వర్ల రామయ్య కోరారు.రాజధాని రైతుల పక్షాన పోరాటం చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి వేదికను రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలూ పంచుకుంటాయని టీడీపీ భావిస్తోందని రామయ్య ఆకాంక్షను వ్యక్తం చేశారు.