చంద్రబాబు బాకీ తీరుస్తావా: పవన్ కల్యాణ్ ను ఏకిపారేసిన అంబటి రాంబాబు

By telugu teamFirst Published Jan 16, 2020, 7:44 PM IST
Highlights

సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఏకిపారేశారు. ప్రజారాజ్యం మాదిరిగానే జనసేన కాలగర్భంలో కలిసిపోతుందని అంబటి రాంబాబు అన్నారు.

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తాను వామపక్షాలకు బాకీ లేనని చెప్పిన పవన్ కల్యాణ్ మాటలపై ఆయన స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుు బాకీ ఉన్నారా అని అడిగారు.

ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి వాళ్లను చంద్రబాబు బిజెపిలోకి పంపించారని, అటువంటి స్థితిలో పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బాకీ పడ్డారా అని అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని వ్యాఖ్యానించారు. పవన్ నిలకడ లేని వ్యవహారాలను వామపక్షాలు గమనించాలని ఆయన అన్నారు. 

Also Read: బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు : చంద్రబాబును వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చేందుకే..

సీద్ధాంతాలు లేక ప్రజారాజ్యం మాదిరిగా జనసేన కూడా కాలగర్భంలో కలిసిపోతుందని ఆయన అన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని ఆయన అన్నారు. బిజెపి, జనసేన పొత్తుపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఏ విధమైన ప్రభావం చూపలేకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు ఎలా పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టాలనే బిజెపితో పొత్తు పెట్టుకున్నారా అని ఆయన అడిగారు. 2-19లో టీడీపీతో పవన్ లాలూచీ ఒప్పందం చేసుకుని వామపక్షాలతో కలిసి పోటీ చేశారని ఆయన అన్నారు. ఒక్క పార్టీతోనైనా దీర్షకాలం పవన్ ఉన్నారా అని ఆయన నిలదీశారు. 

Also Read: బీహార్ ఫార్ములా: ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్

ప్రభుత్వం విఫలమైందని పవన్ ఏ విధంగా ఆరోపిస్తున్నారని ఆయన అడిగారు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సహకరించేందుకే కూటమి కట్టారా అని ఆయన పవన్ కల్యాణ్ ను నిలదీశారు. ఎవరు ఎన్ని కూటములు కట్టినా తమకు అభ్యంతరం లేదని, తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసేత్ మాత్రం సహించబోమని ఆయన అన్నారు. 

Also Read: టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్

click me!