చంద్రబాబుకే పంపా, స్పీకర్ కి కాదు: మాణిక్యాలరావు క్లారిటీ

By Nagaraju TFirst Published Jan 30, 2019, 3:03 PM IST
Highlights

ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను రాజీనామా చేసి దీక్ష చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు.  రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందన్నారు. 

అమరావతి : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించారు. అయితే తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాజీమంత్రి మాణిక్యాలరావు సైతం రాజీనామా చేశారు. 

అయితే ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి మాణిక్యాలరావు రాజీనామాను ఎందుకు ఆమోదించలేదన్న అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాజీమంత్రి మాణిక్యాలరావు తన రాజీనామాపై వివరణ ఇచ్చారు. 

ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను రాజీనామా చేసి దీక్ష చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు.  రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందన్నారు. 

నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చానని తెలిపారు. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందని మాణిక్యాలరావు చెప్పుకొచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మాజీమంత్రి మాణిక్యాలరావు డిశ్చార్జ్: దీక్ష భగ్నంపై ఆగ్రహం

మాణిక్యాల రావు దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

చంద్రబాబు హామీలు హుష్ కాకి: దీక్షకు దిగిన మాణిక్యాలరావు

దీక్షకు దిగుతున్నా, చంద్రబాబు కళ్లు తెరవాలి : మాజీమంత్రి మాణిక్యాలరావు

నేను త్యాగం చేస్తేనే ఎమ్మెల్యే అయ్యావ్ : ఈలి నాని

చిల్లర రాజకీయాలు మానుకో: మాణిక్యాల రావుకు చంద్రబాబు వార్నింగ్

మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన నిర్ణయం

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత...ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాబోయే ఎన్నికల్లో టీడీపీ భవితవ్యంపై మాజీమంత్రి జోస్యం

 

click me!