తప్పులు కప్పిపుచ్చుకునేందుకే అఖిలపక్ష భేటీ.. విజయసాయి రెడ్డి

Published : Jan 30, 2019, 02:38 PM IST
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే అఖిలపక్ష భేటీ.. విజయసాయి రెడ్డి

సారాంశం

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎందుకు హాజరుకావడం లేదని మీడియా ప్రతినిధితులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎందుకు హాజరుకావడం లేదని మీడియా ప్రతినిధితులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

 రాజ్యాంగ ఉల్లంఘటనకు పాల్పడిన స్పీకర్ కోడెల నేతృత్వంలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ఫలితాలు అందించలేవని, అందుకే తాము ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని ఆయన అన్నారు. అభివృద్ధి నిరోధకశక్తిగా మారిన టీడీపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అఖిలపక్ష భేటీ అని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని మండిపడ్డారు. వైసీపీ మాత్రం మొదటి నుంచి హోదా కోసం పోరాడుతుందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే