పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి.తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
అమరావతి:పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నవయుగ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టేందుకు వీలుగా తాజాగా ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తమకు కేటాయించిన టెండర్ రద్దు చేయడంతో పాటు రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త టెండర్లకు ఆహ్వానం పలకడంపై నవయుగ కంపెనీ మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై మంగళవారరం నాడు కోర్టులో విచారణ జరిగింది.ఇరు వర్గాల వాదనలను కోర్టు వింది.
ఏజీ జెన్‌కో తమకు స్థలం చూపని కారణంగానే జల విద్యుత్ ప్రాజెక్టు పనులు ఆలస్యమైనట్టుగా నవయుగ కంపెనీ హైకోర్టుకు తెలిపింది. తమ కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమంగా ప్రాజెక్టు పనులు నిర్వహించినట్టుగా ఆ కంపెనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఏపీ జెన్ కో స్థలం చూపకుండా ఆలస్యం చేస్తే ఆ తప్పు తమది ఎలా అవుతుందని నవయుగ కంపెనీ కోర్టులో వాదించింది. ఇదిలా ఉంటే ఏపీ జెన్ కో స్థలం ఇవ్వకుండా ఆలస్యం చేస్తే కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయకూడదని కోర్టులో ప్రభుత్వ లాయర్ నవయుగ కంపెనీ ప్రశ్నించారు.ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సంబంధిత వార్తలు
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్
రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
జైన్ షాక్: జగన్ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు