జెసి దివాకర్ రెడ్డిపై హోం మంత్రి చిన రాజప్ప షాకింగ్ కామెంట్స్

Published : Sep 22, 2018, 01:18 PM ISTUpdated : Sep 22, 2018, 01:20 PM IST
జెసి దివాకర్ రెడ్డిపై హోం మంత్రి చిన రాజప్ప షాకింగ్ కామెంట్స్

సారాంశం

పోలీసులపై జెసి చేసిన వ్యాఖ్యలపై, పోలీసు అధికారుల సంఘం ఆయనకు అదే స్థాయిలో హెచ్చరికలు చేడం, తిరిగి జేసి తీవ్ర స్థాయిలో మండిపడడంపై చినరాజప్ప శనివారం స్పందించారు. 

కాకినాడ: పోలీసులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తమ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై హోం మంత్రి చిన రాజప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులపై జెసి చేసిన వ్యాఖ్యలపై, పోలీసు అధికారుల సంఘం ఆయనకు అదే స్థాయిలో హెచ్చరికలు చేడం, తిరిగి జేసి తీవ్ర స్థాయిలో మండిపడడంపై ఆయన శనివారం స్పందించారు. 

పోలీసులపై జెసి దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది సరి కాదని ఆయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో అన్నారు.  టీడీపీ ఎంపీగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం  సరికాదని ఆయన అన్నారు.  జేసీ తీరును ఆయన విజ్ఞతకే వదులుతున్నానని అన్నారు. 

పోలీసు సంఘం ప్రతినిధులు కూడా నాలుకలు కోస్తామని అనడం సమర్థనీయం కాదని అబిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. పోలీసులు సంయమనంతో పరిస్థితులను బట్టి స్పందించాలని చిన రాజప్ప సూచించారు.

సంబంధిత వార్తలు

మీసం తిప్పితే హీరోవా, చూసుకొందాం,రా...:సీఐపై జేసీ

టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

సిఐ వార్నింగ్: జేసి ఏమన్నాడో చూడండి (వీడియో)

ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు