నెల్లూరులో జగన్ కి షాక్.. సీనియర్ నేత రాజీనామా

Published : Sep 22, 2018, 12:53 PM IST
నెల్లూరులో జగన్ కి షాక్.. సీనియర్ నేత రాజీనామా

సారాంశం

తనను కాదని మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పార్టీకి రాజీనామా చేశారు.

నెల్లూరు జిల్లాలో జగన్ కి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌, వైకాపా నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను జగన్ .. ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కి అప్పగించారు. తనను కాదని మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పార్టీకి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వైఖరి వల్లే మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొమ్మిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలి.. అంత డబ్బు నువ్వు పెట్టగలవా? అని జగన్‌ తనను అడిగినట్లు బొమ్మిరెడ్డి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు