రేపు అమెరికా పర్యటనకు సీఎం చంద్రబాబు

By ramya neerukondaFirst Published 22, Sep 2018, 10:20 AM IST
Highlights

ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. 

ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరిగి 28న ఉదయం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.

చంద్రబాబు పర్యటన ఇలా సాగనుంది..

22న ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో కూడా భేటీకానున్నారు. అలాగే న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్‌కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఈ నెల 23న 'మడోయర్ మెరైన్' ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో, రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్‌షాను చంద్రబాబు కలవనున్నారు. ఈ నెల 24న గూగుల్ ఎక్స్ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఎఫ్ సాక్ ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగం ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ నెల 25న సునీల్ భారతి మిట్టల్‌తో చంద్రబాబు భేటీ అవ్వనున్నారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీలో వ్యాపార అవకాశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. సిస్కో మాజీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జాన్‌తో భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. 28న ఉదయం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు.

Last Updated 22, Sep 2018, 10:20 AM IST