బాబు అదే నమ్ముతారు: వైసీపీలో చేరిన అవంతి

By narsimha lodeFirst Published Feb 14, 2019, 5:08 PM IST
Highlights

జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొన్నారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు.  ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను తీసుకువస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబునాయుడు భ్రమలో ఉన్నాడన్నారు

హైదరాబాద్: జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొన్నారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు.  ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను తీసుకువస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబునాయుడు భ్రమలో ఉన్నాడన్నారు. అధికారం కోసం తాను పార్టీ మారలేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు.ఈ ఐదేళ్లలో ఒక్క పని కూడ తన వ్యక్తిగతంగా బాబు వద్ద తాను తీసుకోలేదన్నారు.

గురువారం నాడు హైద్రాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు.  జగన్ సమక్షంలో అవంతి శ్రీనివాస్  వైసీపీలో చేరారు. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. 

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో మనం కూడ రాజీనామాలు చేద్దామని తాను సూచించినట్టు ఆయన గుర్తు చేశారు. కానీ, రాజీనామాలకు చంద్రబాబునాయుడు ఒప్పుకోలేదన్నారు.

ప్లకార్డులు, ధర్నాలకు మాత్రమే పరిమితమైనట్టు చెప్పారు. మోడీ  అధికారంలోకి రారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది, ప్రత్యేక హోదా వస్తోందని చంద్రబాబునాయుడు చెబుతున్నారన్నారు.

 

చంద్రబాబునాయుడు ఏది చెబితే  అది ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారని....ఇది సాధ్యం కాదన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం తాను  దీక్ష చేస్తే కొందరు పార్టీలోని పెద్దలు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని అవంతి శ్రీనివాస్  చెప్పారు.

ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడు మాట మార్చారని చెప్పారు. కానీ, జగన్ మాత్రం ఈ విషయమై మాట మార్చలేదన్నారు.ఎన్నికల్లో గెలవడం కోసం మాట మార్చే తత్వం జగన్‌ది కాదన్నారు. తాను చెప్పిన మాట కోసం జగన్ చివరి వరకు నిలబడ్డారని చెప్పారు.

ఓ ఎమ్మెల్యే అవినీతి విషయంలో సాక్షాత్తూ ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కొందరికే చంద్రబాబునాయుడు న్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరూ ఆపలేరన్నారు. జగన్ మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి అంటూ అవంతి శ్రీనివాస్ చెప్పారు. జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు.

ఎన్ని సంక్షేమ పథకాలను చంద్రబాబునాయుడు పెట్టినా ప్రయోజనం ఉండదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టింది, హింస పెట్టింది మీరేనని అవంతి శ్రీనివాస్ బాబుపై విమర్శించారు.

వైఎస్ఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేశారు... కానీ, చంద్రబాబునాయుడు మాత్రం కొన్ని వర్గాలకు మాత్రమే న్యాయం చేశారని చెప్పారు. ఎవరు ప్రశ్నించినా కూడ  చంద్రబాబుకు నచ్చడం లేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తాను పీఆర్పీలో చేరినట్టు అవంతి శ్రీనివాస్ చెప్పారు.

రాష్ట్రంలో దుర్మార్గమైనా పాలన సాగిస్తున్నాడన్నారు.ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉన్నవారు బాబు దృష్టిలో అసమర్ధులని అవంతి శ్రీనివాస్ చెప్పారు.జగన్ కాపు రిజర్వేషన్లు చేస్తానని చెప్పారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జగన్ ఏనాడూ మాట్లాడలేదన్నారు. జగన్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాష్ట్ర నాయకత్వాన్ని మార్చుకొని మంచి పాలన తెచ్చుకొందామని అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఐదేళ్లలో నా వ్యక్తిగతానికి సీఎం వద్ద ఒక్క పని కూడ చేసుకోలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తమకు 2014లో ఐదు సీట్లు ఇస్తామని చెప్పారన్నారు. కానీ మూడు సీట్లు  మాత్రమే ఇచ్చినట్టు  అవంతి శ్రీనివాస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

జగన్‌తో అవంతి భేటీ: వైసీపీలో చేరిక లాంఛనమే

టీడీపికి అవంతి రాజీనామా: సబ్బం హరికి లైన్ క్లియర్

త్యాగానికి గంటా రెడీ: టీడీపీ నేతల టచ్ లోకి రాని అవంతి

టీడీపీకి అవంతి రాజీనామా, రేపు జగన్‌ను కలిసే అవకాశం

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?

 

click me!