ఐదేళ్లు నాతో పనులు చేయించుకున్నారు: ఆమంచి, అవంతిలపై చంద్రబాబు స్పందన

Siva Kodati |  
Published : Feb 14, 2019, 03:49 PM IST
ఐదేళ్లు నాతో పనులు చేయించుకున్నారు: ఆమంచి, అవంతిలపై చంద్రబాబు స్పందన

సారాంశం

పార్టీని వీడే నాయకులను చూసి తాను భయపడనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం మాట్లాడారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన స్పందించారు

పార్టీని వీడే నాయకులను చూసి తాను భయపడనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం మాట్లాడారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన స్పందించారు.

కుట్రలో భాగంగానే టీడీపీ ప్రజాప్రతినిధులను లాక్కొంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్న ఓ ఎమ్మెల్యే వెళ్లి కలిశాడని,  ఇవాళ మరో ప్రజాప్రతినిధి వెళ్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను అభివృద్ధి చేస్తున్నందుకే వాళ్లకు భయం పట్టుకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

ఐదేళ్లు టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసి తనతో అన్ని పనులు చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచాతీనీచమైన ఈ చర్యకు దిగిన వాళ్లు ఎలాంటి వ్యక్తులో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే