
వైసీపీ అధినేత జగన్.. తనపై హత్యకు కుట్ర చేశారంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. కేసులో వాదోపవాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కాగా.. ఈ కేసులో సిట్ అధికారుల పురోగతి నివేదికను సీల్డ్ కవర్ లో మంగళవారం కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
కాగా.. ఈ ఘటనపై జగన్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా.. తనకు ఏపీ పోలీసులపై నమ్మకంలేదని జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా..దీనిపై కోర్టు స్పందించింది. దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబరాద్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది.
పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆపేక్షించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ తరపు న్యాయవాది.. ప్రాణాపాయం ఉందనే కారణంతోనే స్టేట్ మెంట్ ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.
more news
జగన్‌పై దాడి: జోగి రమేష్ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత
జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్
జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్‌పై దాడి: శ్రీనివాస్ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?
జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్
జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం
జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్ మళ్లీ జైలుకే