సెల్ఫీలతో కొత్త ముప్పు: జగన్ పై దాడిని ఖండించిన ఓవైసీ

By Nagaraju TFirst Published Oct 25, 2018, 2:31 PM IST
Highlights

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్  రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. జగన్ పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. 

హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్  రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. జగన్ పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. విమానాశ్రయాల్లో భద్రతపై ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 

మరోవైపు సెల్ఫీలతో రాజకీయ నేతలకు కొత్త ముప్పు పొంచి ఉందని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. సెల్ఫీలు తీసుకుంటామని దగ్గరకు వచ్చే వారితో నేతలు జాగ్రత్తగా ఉండాలని ఓవైసీ సూచించారు. దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై జరిగిన దాడిపై అనుమానాలు...జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలి: జీవిఎల్

నిందితుడు జగన్ అభిమాని.. పబ్లిసిటీ కోసమే దాడి: ఏపీ డీజీపీ

విశాఖ ఎయిర్ పోర్టును చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

జగన్ పై కత్తితో దాడి కుట్రేనా....నిందితుడి జేబులో లేఖ

వైఎస్ జగన్‌పై దాడి: ఖండించిన మంత్రి జవహర్

జగన్ పై దాడి... గంటలో నిజాలు తేలుస్తాం.. చినరాజప్ప

click me!