ఓఎల్‌ఎక్స్‌లో జనసేన విక్రయం, సిగ్గులేదా: పవన్ పై మంత్రి నాని ఫైర్

By narsimha lodeFirst Published Jan 17, 2020, 4:42 PM IST
Highlights

ఏపీ మంత్రి పేర్నినాని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

అమరావతి: పవన్ కళ్యాణ్  జనసేన పార్టీని ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి పెట్టారని  ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని విమర్శించారు. పవన్ నాయుడు మాటలకు ఏం విలువ ఉందని పేర్ని నాని ప్రశ్నించారు.

Also read:డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట

శుక్రవారం నాడు మంత్రి పేర్ని నాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 2014లో మోడీ, బాబును గెలిపించారని పవన్ చెప్పారు. 2019లో కూడ వైఎస్ జగన్ ను కూడ గెలిపించారని చెప్పారని మంత్రి నాని ఎద్దేవా చేశారు. 2024లో కూడ జగన్‌ను కూడ మళ్లీ తానే గెలిపించారని నాని విమర్శలు గుప్పించారు.

Also read:పవన్ కళ్యాణ్ పై కేఏపాల్ సంచలన కామెంట్స్

చంద్రబాబు అవాక్కయ్యేలా పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు లోకేష్ పై నమ్మకం లేనందునే పవన్ కళ్యాణ్ ను దత్తత తీసుకొన్నారని మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు

Also Read సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్...

 పూటకో మాట మాట్లాడే పవన్ మాటలకు విలువ ఏముంటుందన్నారు మంత్రి. 2014 లో సీట్లు గెలవలేని పవన్ కల్యాణ్ 2024 లో ఏం గెలుస్తారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. బీజేపీతో భేషరతుగా పవన్ కళ్యాణ్ కలవటం లో ఉద్దేశ్యం ఏమిటో తెలపాలని పవన్ కళ్యాణ్‌ చెప్పాలని మంత్రి కోరారు.

Also read: మాకు బీజేపీ గేట్లు మూసివేశారా: బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Also read:టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్

Also read:అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా

also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా

also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

గతంలో ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ పై ప్రధాని మోదీ,అమిత్ షా పై  విమర్శలు చేసిన విషయాన్ని నాని గుర్తు చేశారు. పవన్ ఇప్పుడు షరతుల తో కూడిన ఒప్పందం ఎందుకు చేసుకోలేదో చెప్పాల్సిందిగా కోరారు. బేషరతుగా బీజేపీ తో లొంగి పోవటానికి పవన్ కు సిగ్గు అనిపించటం లేదా పవన్ కళ్యాణ్‌పై మంత్రి పేర్నినాని విమర్శలు గుప్పించారు.

click me!