బయట కాలర్ ఎగరేసి, ఇంట్లోకెళ్లి కాళ్లు పట్టుకోవడం మాకు రాదు: ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటర్

By Siva KodatiFirst Published Nov 12, 2021, 4:41 PM IST
Highlights

ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani) కౌంటర్ ఇచ్చారు. 

ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani) కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఢిల్లీకి మాటిమాటికి వెళ్లేది అడుక్కోవడానికేనా అంటూ సెటైర్లు వేశారు. రోడ్డు మీద కాలర్ ఎగరేయడం.. ఇంట్లో కాళ్లు పట్టుకోవడం మాకు చేతకాదని పేర్ని నాని కౌంటరిచ్చారు. అన్యాయంగా హైదరాబాద్‌ను (hyderabad) పంచేసుకొని ఇవాళ సోకులు మాట్లాడుతున్నారని నాని దుయ్యబట్టారు. 

హైదరాబాద్ ఇప్పుడు పెద్ద పాడికుండ అని.. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నామని మంత్రి గుర్తుచేశారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు .. ఎవరినో తిట్టలేక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకని పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేం బిచ్చమెత్తుకున్నామో.. ఆడుకుంటానికో వెళ్తున్నామని మంత్రి అంగీకరించారు. స్నేహమంటే స్నేహం.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా జగన్ వుంటారని పేర్ని నాని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో వాళ్లని అడిగితే చెబుతారని మంత్రి అన్నారు. 

అంతకుముందు ఏపీలోని (ap govt) జగన్ ప్రభుత్వంపై (ys jagan mohan reddy) తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy)  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు (paddy) సంబంధించి టీఆర్ఎస్ (trs) శ్రేణులు రైతు ధర్నాలు  చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లో శుక్రవారం జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

ALso Read:జగన్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు (central funds) కావాలని.. కేంద్రం ఒత్తిడితో ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని మంత్రి చెప్పారు. దేశంలోని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసంపై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ(శుక్రవారం) రాష్టవ్యాప్త ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ రైతుల నుండి మొత్తం ధాన్యాన్ని ఎలాగయితే కేంద్రం కొనుగోలు చేస్తుందో తెలంగాణ రైతుల నుండి కూడా అలాగే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 

click me!