నల్ల డబ్బును తెల్లగా మార్చే కుట్ర.. రైతుల పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు ఆయనే: బాబుపై పేర్ని నాని ఆరోపణలు

By Siva KodatiFirst Published Nov 12, 2021, 3:46 PM IST
Highlights

అమరావతి (amaravathi farmers) రైతుల పాదయాత్రపై (padayathra) మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. నిజమైన రైతులను చంద్రబాబు మోసం చేశారని.. పార్టీ కండువా కప్పుకోలేని దుస్ధితి టీడీపీదని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలు వాళ్ల జెండా పట్టుకుని యాత్ర చేయలేకపోతున్నారని మంత్రి దుయ్యబట్టారు.

అమరావతి (amaravathi farmers) రైతుల పాదయాత్రపై (padayathra) మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల ముసుగులో (nyayasthanam to devasthanam) టీడీపీ (tdp) ఏజెంట్లు యాత్ర చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. నిజమైన రైతులను చంద్రబాబు మోసం చేశారని.. పార్టీ కండువా కప్పుకోలేని దుస్ధితి టీడీపీదని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలు వాళ్ల జెండా పట్టుకుని యాత్ర చేయలేకపోతున్నారని మంత్రి దుయ్యబట్టారు. రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపార యాత్ర చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు అన్నీ చంద్రబాబేనని.. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆయనేనని మంత్రి వ్యాఖ్యానించారు. 

తన నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకు బాబు స్కెచ్ వేశారని.. రైతుల ముసుగులో వున్న పెట్టుబడిదారుల్ని నట్టేల ముంచిందెవరు అని పేర్ని నాని ప్రశ్నించారు. విశాఖలో అసలు అభివృద్ధే జరగకూడదని కోర్టులకెళ్లి స్టేలు తెస్తున్నారని.. తాను బాగుపడ్డాకే మిగతావాళ్లు బాగుపడాలన్న నీచ ఆలోచన చంద్రబాబుదని పేర్ని నాని మండిపడ్డారు. కుప్పంలో (kuppam municipality election) చంద్రబాబు ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారని.. ఎన్నికల్లో కొనుగోలు మనస్తత్వం చంద్రబాబుదేనని (chandrababu  naidu)  ఆయన అన్నారు. కుప్పంలో చంద్రబాబు  పీకిందేమిటీన్న ఆయన.. 27 ఏళ్లలో ఆయన ఎన్నిసార్లు తన నియోజకవర్గానికి వెళ్లారని పేర్ని నాని ప్రశ్నించారు. 

ALso REad:ఫేక్ సంతకాలతో ఏకగ్రీవాలు.. అభ్యర్థులు కోర్టుకెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకే: చంద్రబాబు వ్యాఖ్యలు

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల (ap local body elections) ఎన్నికల సరళిపై గురువారం టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణలకు సంబంధించి ఫోర్జరీ సంతకాల బాగోతం న్యాయస్థానంలోనూ తేలిందని ఆయన గుర్తుచేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  తిరుపతి (tirupati) స్థానిక ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియలో చోటుచేసుకున్న ఫోర్జరీ సంతకాల వ్యవహారానికి సంబంధించిన పలు పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి వైదొలగాలని... ఫోర్జరీ సంతకానికి బాధ్యుడైన అధికారిని వదిలిపెట్టేది లేదని, శిక్షపడేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.  

ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ సంతకాలతో తనవారిని గెలిపించుకున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ (ys jagan mohan reddy) అరాచక చర్యల వల్లే ఎంపీటీసీ (mptc), జడ్పీటీసీ (zptc) ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏనాడూ ఇలా భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు కాలేదని గుర్తు చేశారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందని.. ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.  

click me!