ఏపీలో పీఆర్సీకై పట్టు: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ మీటింగ్ బైకాట్ చేసిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు

By narsimha lode  |  First Published Nov 12, 2021, 4:22 PM IST

ఏపీలో పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వని కారణంగా ఈ సమావేశాన్ని తొమ్మిది ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి.
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ  నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నివేదికను బయటపెట్టలేదని ఆరోపిస్తూ 13 ఉద్యోగ సంఘాల్లో 9 ఉద్యోగ సంఘాలు సమావేశాన్న బహిష్కరించారు. శుక్రవారం నాడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అమరావతిలోని ఏపీ సచివాలయంలో  ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశానికి  ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇస్తారని ఉద్యోగ సంఘాలు ఆశించారు. కానీ పీఆర్సీ నివేదిక మాత్రం ప్రభుత్వం ఇవ్వలేదు. 

దీంతో prc నివేదికను బయట పెట్టకపోవడాన్ని నిరసిస్తూ తొమ్మిది ఉద్యోగ సంఘాల నేతలు Joint Staff Council సమావేశాన్ని బహిష్కరించారు. పీఆర్సీ నివేదికను ఇస్తామని ప్రభుత్వం  హమీని ఇచ్చిందని employees union నేతలు గుర్తు చేస్తున్నారు.  గత నెలలో నిర్వహించిన సమావేశంలో పీఆర్సీ నివేదికను ఇస్తామని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. గత నెల 29న పీఆర్సీ నివేదికను బయటపెడతామని చెప్పి వాయిదా వేశారన్నారు. మరోవైపు ఈ నెల 10న పీఆర్సీ నివేదికను ఇస్తామని చెప్పి నివేదికను ఎందుకు బయట పెట్టలేదని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Latest Videos

also read:పీఆర్సీ: రేపు ఉద్యోగులతో జగన్ సర్కార్ జాయింట్ కౌన్సిల్ సమావేశం

మరో వైపు Ys Jagan సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. అయితే వారి రిటైర్మెంట్ విషయంలో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందనే విషయాలను పీఆర్సీ నివేదికలో ఏం చెప్పిందోననే అంశం తమకు తెలియాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీ నివేదకలో ఉద్యోగుల్లోని ఏ వర్గాల విషయంలో ఏ రకమైన సిఫారసులున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం తమపై ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

పీఆర్‌సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా  ఏడాది క్రితమే నివేదికను ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు. ఉద్యోగుల ఫిట్‌మెంట్ పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 
 ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27 శాతంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై  ఐఆర్ 27 శాతానికి పరిమితం చేయడంపై ఉద్యోగ సంఘాలు అంగీకరించడానికి సిద్దంగా లేవు. వేతన ఫిట్ మెంట్ పై కూడా కనీసం 60 శాతంగా ఉండాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి నెలకొంది.

ఇదిలా ఉంటే ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయమై పరస్పరం విమర్శించుకొంటున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తనపై విమర్శలు చేసిన ఉద్యోగ సంఘాల నేతలకు కౌంటర్ చేశారు. వెంకట్రామిరెడ్డిపై రెండు రోజుల క్రితం ఇతర ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు. ఈ విమర్శలపై ఈ నెల 11న వెంకట్రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు గతంలో ఎలా వ్యవహరించారో తెలుసునని ఆయన చెప్పారు.


 

click me!