పెట్రోల్ బంకుల వద్ద ధర్నాల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పెట్రోల్ బంకుల వద్ద ధర్నాకు Tdp పిలుపునిచ్చిందని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani ఆరోపించారు. మంగళవారం నాడు మంత్రి అమరావతిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
Pettrol ధర ప్రభావం బీజేపీపై పడిందన్నారు.దేశంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పెట్రోల్, Diesel ధరల పెంపు కారరణంగా Bjp నేతలకు ప్రజలు కళ్లు తెరిపించారని మంత్రి వ్యంగ్యాస్త్రాలను సంధించారు.ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్ పోసి తగులబెట్టారని మంత్రి మండిపడ్డారు. ఏపీ రాష్ట్రంలోని Badvel ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు మంత్రి.
also read:రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన.. పిలుపు ఇచ్చిన చంద్రబాబు
Narendra Modi ప్రధానిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముడిచమురు ధర లీటర్ కు రూ.110 డాలర్లుందన్నారు. కానీ ఇవాళ ముడి చమురు ధర భారీగా తగ్గిందని చెప్పారు. కానీ రూ. 70 ల నుండి ప్రస్తుతం లీటర్ ధర రూ.110కి చేరిందని మంత్రి నాని గుర్తు చేశారు.
Chandrababu Naidu ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీజీల్, పెట్రోల్‌పై రెండు రూపాయాలు సర్‌ఛార్జీ విధించారని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల వద్ద ధర్నా చేయడం వల్ల ఏం ఉపయోగమని చంద్రబాబును మంత్రి ప్రశ్నించారు.
పెట్రోల్, డీజీల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తోందా ... రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు చెప్పుకొనే చంద్రబాబుకు ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని కోరుతూ చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి సూచించారు. 2019 ఎన్నికల నుండి ప్రతి ఎన్నికల్లో టీడీపీని పెట్రోల్ పోసి ప్రజలు తగులబెట్టారని మంత్రి చెప్పారు.
చంద్రబాబుకు వయసు వచ్చింది, కానీ బుద్ది రాలేదని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితమంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లేనని మంత్రి మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలను రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజీల్ పోసి తగులబెట్టారని మంత్రి నాని తెలిపారు.
పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని ఫైర్
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ కు Jana Sena చీఫ్ Pawan Kalyan అల్టిమేటం ఇవ్వడంపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి పవన్ కళ్యాణ్ అల్టిమేటం ఇవ్వాలని మంత్రి సూచించారు. మీతో కలిసి పనిచేయమని బీజేపీ అధిష్టానానికి వార్నింగ్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు మంత్రి నాని.
ప్రజల కోసం ఏం చేయాలో సీఎం జగన్ కు తెలుసునని చెప్పారు. ప్రధాని మోడీ, అమిత్ షా లు అపాయింట్ మెంట్ కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ అపాయింట్ మెంట్ దక్కని కారణంగానే విశాఖ స్టీల్
ప్లాంట్ విషయంలో అఖిలపక్షం తీసుకెళ్లాలని కోరుతున్నారని మంత్రి నాని చెప్పారు. అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి వచ్చి మోడీ, అమిత్ షాలతో పర్సనల్ గా మాట్లాడేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసినా జగన్ ను ఏం చేయలేరన్నారు.