జగతి పబ్లికేషన్‌ లోవి పెట్టుబడులు కావు.. అన్నీ ముడుపులే.. సీబీఐ

By AN TeluguFirst Published Nov 9, 2021, 9:38 AM IST
Highlights

Jagati Publications లోకి వచ్చింది పెట్టుబడులు కావని.. ముడుపులేనని సిబిఐ స్పష్టం చేసింది. దీనిపై బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. తమపై కేసులను కొట్టివేయాలని Hetero company, ఆ సంస్థ ఎండి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ షమీమ్ అక్తర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ సొంత మీడియా సంస్థ ‘జగతి పబ్లికేషన్’ లో ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండానే రూ.1246 కోట్ల ‘లబ్ది’ పొందారని సీబీఐ స్పష్టం చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముడుపులను పెట్టుబడుల రూపంలో స్వీకరించారని తెలిపింది. ‘క్విడ్ ప్రోకో’ నిజమని తేల్చిచెప్పింది.

Jagati Publications లోకి వచ్చింది పెట్టుబడులు కావని.. ముడుపులేనని సిబిఐ స్పష్టం చేసింది. దీనిపై బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. తమపై కేసులను కొట్టివేయాలని Hetero company, ఆ సంస్థ ఎండి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ షమీమ్ అక్తర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఈ కేసులో సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదనలు వినిపించారు. ‘జగతి సంస్థలో  జగన్ రూపాయి కూడా Investment పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారు. ఇందుకోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారు.  ఈ విషయంలో జగన్, విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించారు.

తండ్రి అధికారాన్ని ద్వారానే హెటిరో, తదితర కంపెనీలకు లబ్ధి చేకూర్చి, వారిచ్చే ముడుపులనే.. జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు మళ్ళించారు’ అని తెలిపారు.  ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  స్వయంగా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్ కేర్ లో జరిపిన తనిఖీల్లో ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు.

రెండు కలిపి చూడాలి…

వైఎస్ సర్కారు భూములు కేటాయించడం.. ఆ భూములు పొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం... అప్పట్లో జరిగిన ‘QuidProco’  ఇదేనని సీబీఐ ఇప్పటికే తేల్చింది.  అయితే పిటిషనర్లు భూకేటాయింపులు వేరు, పెట్టుబడులు వేరు అని భ్రమింప జేస్తున్నారని, రెండింటినీ కలిపి చూడాలని CBI తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అప్పుడే అసలైన కుట్ర బయట పడుతుందని వివరించారు..

పెట్టుబడులకు సంబంధించి హెటిరో సంస్ఘ నిర్ణయాలకు, ఎండీ శ్రీనివాస్ రెడ్డికి సంబంధం లేదని వాదించడం సరికాదని తెలిపారు. ‘శ్రీనివాస్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించడం వల్లే హెటిరో సంస్థ పెట్టుబడుల నిర్ణయం తీసుకుంది. దీనికి బలమైన ఆధారాలు ఉన్నాయి. పెట్టుబడులకు సంబంధించిన  షరతుల్లో  జగతి పబ్లికేషన్స్ వాటాలను ఇతరులకు విక్రయించరాదని...కేవలం వాటాదారులు, కుటుంబ సభ్యులకే విక్రయించాలని ఉంది.

Shares విక్రయించడానికి వీలు లేకుండా.. పెట్టిన పెట్టుబడిపై ఇప్పటివరకు ఎటువంటి లాభం రాకుండా... ఎవరైనా పెట్టుబడి పెడతారా?’ అని సిబిఐ న్యాయవాది సురేందర్ ప్రశ్నించారు.  జగతి పబ్లికేషన్స్లో  YS Jagan  కేవలం రూ. 73 కోట్లు పెట్టుబడి పెట్టి 70 శాతం తీసుకున్నారని.. రూ. 1173 కోట్లు పెట్టిన ఇతర సంస్థలకు కేవలం 30 శాతం వాటా మాత్రమే దక్కిందని తెలిపారు.

జగన్ పెట్టిన రూ.  73 కోట్లు సైతం కార్మెల్ ఏషియా, సండూర్ పవర్ కంపెనీల నుంచి వచ్చాయి.  అంటే.. ఈ లెక్కన జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా రూ.1246 కోట్లు  పెట్టుబడులు తెచ్చారు. నేరం జరిగిన డానికి సీబీఐ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి.  పూర్తిస్థాయి విచారణ మొదలైతేనే  నేరం నిరూపిస్తాం అని తెలిపారు.

 స్పష్టంగా ‘ లింకు’..

ఇన్నేళ్లు అయినప్పటికీ ఈ కేసులో విచారణ ఇంకా డిశ్చార్జి పిటిషన్ల వద్దే ఉందని సిబిఐ న్యాయవాది తెలిపారు.  హెటిరో  పెట్టుబడిని సమర్థించుకోవడానికి  తప్పుడు  తేదీతో Vijayasaireddy డెలాయిట్ సంస్థ నుంచి వాల్యుయేషన్ రిపోర్టు తెప్పించారు అన్నారు. హెటిరో  భూ కేటాయింపులకు జగన్ సంస్థల్లో పెట్టుబడుల ప్రవాహానికి స్పష్టమైన లింకు ఉందని వాదించారు.

Petrol and Diesel Rates : డిస్కౌంట్ సేల్ లా 5,10 కాదు.. దమ్ముంటే కేంద్రమే రూ.25 తగ్గించాలి.. పేర్ని నాని..

జగన్ సంస్థల్లో హెటిరో   2006, 2007లో  రెండు దఫాలుగా పెట్టుబడి పెట్టిందని..  అదే సమయంలో  ఆ సంస్థకు  వైఎస్ ప్రభుత్వం  50 ఎకరాలు  కేటాయించిందని తెలిపారు.  2008లో  మరోసారి పెట్టుబడి పెట్టకే.. Land allotment 75 ఎకరాలకు చేరిందని  తెలిపారు.  ఈ వ్యవహారంలో హెటిరో  ఎండి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు కాబట్టే.. ఆయన నిందితుడిగా చేర్చామని స్పష్టం చేశారు.

హెటిరో  డైరెక్టర్లు అందరూ నిందితులని తాము చెప్పడం లేదని పేర్కొన్నారు. నిబంధనల మేరకే Chargesheetను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిందని..  తప్పు జరిగినట్లు అన్ని రుజువులు ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.  సిబిఐ వాదనలకు తాము సమాధానం చెబుతామని హెటిరో  సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.  దీంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

click me!