చంద్రబాబు పగటి వేషగాడు: ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్

Published : Oct 17, 2021, 02:23 PM IST
చంద్రబాబు పగటి వేషగాడు: ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్

సారాంశం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు పగటి వేషగాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి:  చంద్రబాబునాయుడు ఓ పగటి వేషగాడు అంటూ ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు కృష్ణా జిల్లా గొల్లపూడిలో నిర్వహించిన ysr asara కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో   TDP చీఫ్ Chandrababu పై మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

also read:లోకేష్‌పై నమ్మకం లేకే పవన్‌ వైపు: చంద్రబాబుపై కొడాలి ఫైర్

డ్వాక్రా సంఘాలను తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకొనేవాడని ఆయన విమర్శించారు.. 2014లో అధికారంలోకి రావడానికి Dwacra సంఘాలను అడ్డం పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. డ్వాక్రా సంఘాలను మోసం చేశాడని ఆయన చంద్రబాబుపై  మండిపడ్డారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన చంద్రబాబు పేరు  సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని ఆయన చెప్పారు.

Devineni Uma సొల్లు కబుర్లు చెబుతుంటాడని ఆయన మండిపడ్డారు. తాను , వల్లభనేని వంశీ ఫోన్లు చేసినా  ఉమా ఫోన్లు ఎత్తడని ఆయన ఈ సందర్భంగా చెప్పారు .ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దని ఆయన కోరారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టాలని ఆయన అధికారులకు భరోసా ఇచ్చారు. అధికారులకు తాము  అండగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.

Ycp అంటే Tdp కంటే బలమైన క్యాడర్ ఉందని మంత్రి నాని గుర్తు చేశారు.  గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్‌సీపీ జెండానే ఎగురుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని​, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, కైలే అనిల్‌ కుమార్‌, సీఎం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్