వైఎస్ జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రోజు రోజుకు వైఎస్ జగన్ గ్రాఫ్ పెరిగిపోతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఓటమిపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సాకులు వెతుకుతున్నారన్నారు.
తాడేపల్లి:సాధారణ ఎన్నికల్లో చూపిన అభిమానం కంటే ఎక్కువ అభిమానాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీపై చూపారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారుఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయన్నారు.వరుస ఎన్నికల్లో వస్తున్న ఎన్నికల ఫలితాలే జగన్ పాలనకు నిదర్శనమని ఆయన చెప్పారు. ycp సర్కార్ చేస్తున్న అభివృద్దికి పట్టణ ప్రజలు పట్టం కట్టారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 99 శాతం ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నారు.
రోజు రోజుకు ys jagan కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. ఒకటి రెండు చోట్ల తాము ఓటమి పాలు కావడంపై కూడా ఆత్మవిమర్శ చేసుకొంటామని botsa satyanarayana తెలిపారు. మున్సిపల్ ఎన్నకిల్లో ఓటమి పాలైనా కూడా చంద్రబాబునాయుడు చేస్తున్న కామెంట్స్ పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిందపడ్డా కూడా తనదే పై చేయి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
also read:YSRCP Victory in Kuppam: కుప్పం విక్టరీ.. ఆనందంలో సీఎం జగన్.. మంత్రి పెద్దిరెడ్డికి అభినందనలు..
కుప్పం ఫలితంతోనైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. ఓటమిపై సాకులను వెతకడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చెప్పిన మాటలనే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై Chandrababu చెబుతున్నారని మంత్రి తెలిపారు.2019లో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు,ఇవాళ మాత్రం దొంగ ఓట్లతో ఓటమి పాలయ్యామని చంద్రబాబు చెబుతున్నారన్నారు.Amaravati ఉద్యమాన్ని స్వాతంత్ర్య ఉద్యమంతో Ap High Court పోల్చిందని తాను నమ్మడం లేదన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి అమరావతి రైతుల ఉద్యమానికి పోలిక ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. కానీ ఒక్క సామాజిక వర్గం కోసం అమరావతి ఉద్యమం సాగుతుందన్నారు. అమరావతి ఉద్యమంపై ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని తాను భావించడం లేదన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకొంది. కొండపల్లిలో 14 వార్డులను కైవసం చేసుకొంది. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల ఆ పార్టీ ప్రభావంత అంతంత మాత్రంగానే కన్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను గెలుచుకొంది. రెండు రోజుల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పంలో టీడీపీ ఓటమి పాలు కావడం ఆ పార్టీని షాక్ కు గురి చేసింది.
అనంతపురం జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ స్థానంలోని పెనుకొండ మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకొంది. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లాలో టీడీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొంది. పరిటాల రవీంద్ర మరణంతో టీడీపీకి తీవ్ర నష్టమేనని వరుస ఓటములతో ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.