2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి (telugu desam party) వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ కంచుకోటలు కూలిపోతున్నాయి. తాజాగా జరిగిన కుప్పం, పెనుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి (telugu desam party) వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీడీపీకి చేదు అనుభవాలనే మిగిలుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా.. ఆ పార్టీ గెలుపుబాట పట్టలేకపోతుంది. కొన్ని నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల ఓటమి చెందారు. ఇక, ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కార్పొరేషన్‌లతో పాటు, తాడిపత్రి (Tadipatri) మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీ ఖాతాలో వేసుకుంది. దీంతో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.
ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికలను (Parishad elections) తాము బహిష్కరిస్తున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. అయినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొందరు పోటీలో నిలిచారు. అయితే చాలా చోట్ల ఆ పార్టీకి చెందిన నాయకులు ఓటమి చెందారు. కుప్పంలో సైతం ఎంపీటీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ హవా ప్రదర్శించింది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే tdp కంచుకోటలను కూడా వైసీపీ బద్దలు కొడుతున్నట్టుగానే కనిపిస్తుంది.
undefined
కుప్పం మున్సిపాలిటీలో (kuppam municipal elections 2021) విజయం చంద్రబాబు కోటాలో పాగా వేసిన వైసీపీ.. టీడీపీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో కూడా ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. అక్కడ టీడీపీ ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. పరిటాల రవీంద్ర (paritala ravindra) నుంచి.. 2019 ముందు వరకు పెనుకొండ టీడీపీకి కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. పరిటాల ఆ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014 టీడీపీ నేత బీకే పార్థసారథి పెనుకొండ నుంచి విజయం సాధించారు.
అయితే 2019 లో అక్కడ కూడా సీన్ మారిపోయింది. పరిటాల అభిమానులతో పాటు, టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ విజయం సాధించారు. ఇక, రాప్తాడులో కూడా టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌పై (paritala sriram) వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించాడు.
ఇక, పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మాదిరిగానే అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ సత్తా చాటింది. రాప్తాడు, పెనుకొండలలో టీడీపీ బలపరచిన అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోయారు. తాజాగా జరిగిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. అక్కడ మొత్తం 20 స్థానాలు ఉండగా.. 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. పెనుగొండలో(penukonda municipal results) గెలుపు కోసం అనంతపురం టీడీపీ సీనియర్ నేతలు, పరిటాల శ్రీరామ్ తీవ్రంగా శ్రమించారు. వార్డు వార్డుకు తిరిగిన పరిటాల శ్రీరామ్ టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. అయిన కూడా ఫలితం లేకపోవడం టీడీపీ శ్రేణులను, పరిటాల అభిమానులను తీవ్ర నిరుత్సహనికి గురిచేసింది.