మీ అంత సంస్కార హీనులం కాదు, దిగజారకండి: చంద్రబాబుకు మంత్రి బొత్స వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Jul 11, 2019, 3:48 PM IST
Highlights

మంచి, మర్యాద, గౌరవం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఉదయం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను నా అనుభవం అంతలేదు నీ వయస్సు అంటూ ప్రశ్నించడం సబబా అని నిలదీశారు. అలా అనడానికి చంద్రబాబుకు ఎవరు హక్కు ఇచ్చారని నిలదీశారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోతున్నారంటూ మండిపడ్డారు. ఎందుకు సహనం కోల్పోతున్నారో అర్థం కావడం లేదన్నారు.  

మంచి, మర్యాద, గౌరవం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఉదయం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను నా అనుభవం అంతలేదు నీ వయస్సు అంటూ ప్రశ్నించడం సబబా అని నిలదీశారు. అలా అనడానికి చంద్రబాబుకు ఎవరు హక్కు ఇచ్చారని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఆయనను గౌరవించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మీరు మళ్లీ గౌరవం ఇవ్వలేదంటూ మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు.  

గౌరవం విషయంలో చంద్రబాబు నాయుడు కంటే అంతా గౌరవంతమైన వాళ్లే ఉన్నారని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. చరిత్రల గురించి మాట్లాడితే ఎవరు మర్యాదస్తులో, ఎవరు గౌరవవంతమైన వారో తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఏదైనా రికార్డు చూసే మాట్లాడతారాని చంద్రబాబులా కళ్లబొల్లి మాటలు మాట్లాడరని విరుచుకుపడ్డారు.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటే సంస్కార హీనులు కాదన్నారు. తమకు సంస్కారం ఉందన్నారు. గత ఐదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వం నడిపిన అసెంబ్లీ, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న సభా సంప్రదాయాలను లెక్కలేసుకుంటే మీకంటే వందశాతం అద్భుతంగా నడుపుతున్నామని తెలిపారు.  

ఐదేళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతిమయం చేసింది మీరు కాదా అని నిలదీశారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు సంయమనం పాటించాలని, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని హితవు పలికారు.  ఈ ప్రభుత్వాన్ని సమర్థించాలని కుదరకపోతే కూర్చోవాలని అంతేకాని రోజురోజుకు దిగజారిపోవద్దంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తమాషాగా ఉందా, జగన్ పై ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు

చంద్రబాబు రూపాయి ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తావా: వైయస్ జగన్ సవాల్

పంతాలకు పట్టింపులకు పోవద్దు, ఎక్కడో ఉంటారు: చంద్రబాబుపై అంబటి ధ్వజం

ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక

నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్

click me!