కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

Published : Sep 16, 2019, 03:29 PM IST
కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

సారాంశం

  కోడెల శివప్రసాదరావుది సుదీర్ఘ రాజకీయ జీవితమని స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్  ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కోడెల శివప్రసాదరావుది సుదీర్ఘ రాజకీయ జీవితమని స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్  ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

ఇకపోతే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సైతం కోడెల మృతికి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. 

మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటుతో మరణించారా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అనుమానాస్పదంగా కేసుగా నమోదు చేశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

 

PREV
click me!

Recommended Stories

కన్నీరు పెట్టించే ఘటన పవన్ వీరాభిమాని నిరంజన్ మృ*తి | Pawan Kalyan Fan Niranjan Passes Away
కూతురు, అల్లుడితో వైఎస్సార్ కి నివాళి అర్పించిన షర్మిల | YS Sharmila Visits YSR Ghat at Idupulapaya