సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు లెక్కలు చెప్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి సభలో ఆరోపించారు.
అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సభను తప్పుదోవ పట్టించేలా మాజీమంత్రి అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. తప్పుడు సమాచారంతో సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్న అచ్చెన్నాయుడిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు శ్రీకాంత్ రెడ్డి.
సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు లెక్కలు చెప్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి సభలో ఆరోపించారు.
ఇకపోతే మద్యం అమ్మకాల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతూ, సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రివిలేజ్ నోటీసును ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సభలో చదివి వినిపించారు.
ఆ ఎమ్మెల్యేలేమైనా పనికిమాలినోళ్లా..? పీకపోయినా సరే..: స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు...
ప్రివిలేజ్ మోషన్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి పంపించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
దిశ చట్టం నాతోనే ప్రారంభించండి, తట్టుకోలేను: సభలో మహిళా ఎమ్మెల్యే ఆవేదన...
అలాగే అసెంబ్లీ గేటు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
అసెంబ్లీలో గేటు వద్ద జరిగిన ఉదంతపై సభలో చర్చ జరుగుతున్న తరుణంలోనే తాను ఆ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఇకపోతే అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు సభ ప్రారంభంలోనే సీఎం జగన్ పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.
ఆ ఎమ్మెల్యే నా నియోజకవర్గాన్ని పూర్తిగా నాకేశాడు: రాపాక సంచలన వ్యాఖ్యలు...