అర్థనగ్నంగా నిలబడి.. బూట్లతో కొట్టుకుంటూ.. జగన్ వీరాభిమాని నిరసన

By telugu teamFirst Published Dec 17, 2019, 1:44 PM IST
Highlights

పార్టీ గెలుపుకోసం పనిచేశానని, ఒకసారి అధికారంలోకి రాగానే కొత్త కొత్త నాయకులు వైసీపీలోకి రావడం మొదలుపెట్టారని రాజమాణిక్యం వాపోయాడు. అనంతరం జేసీ-2 చంద్రమౌళిని కలిసి వినతిపత్రం అందించాడు. 

ఆయన జగన్ కి వీరాభిమాని. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జుట్టు కూడా తీయను అంటూ భీష్మించుకు కూర్చున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు తాను అభిమానించే పార్టీ నేతల ప్రవర్తనను వ్యతిరేకిస్తూ వినూత్నంగా నిరసన చేపట్టాడు. నడుముకి గోనెసంచె కట్టుకొని.. చేతిలో బూట్లు పట్టుకొని తన చెంపలు తానే వాయించుకున్నాడు. ఎందుకంటే... తమ పార్టీ నేతలే తమకు కనీసం రేషన్, పింఛను ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సోమవారం చిత్తూరు జి ల్లా కేంద్రంలో నిర్వహించిన  ‘స్పందన’ కార్యక్రమంలో జగన్ వీరాభిమాని రాజమాణిక్యం పాల్గొన్నాడు.  వికలాంగుల పిం ఛను, తెల్ల రేషన్‌కార్డుకు అర్హుడినైనా తనకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు... మండల వైసీపీ కన్వీనర్‌ ప్రతాప్ రెడ్డి చెబితేనే ఇస్తామని తహసీల్దార్‌ చెబుతున్నారని వాపోయాడు. దళితుడినైన తనను అధికారు లు పట్టించుకోవడం లేదన్నాడు. పార్టీ అభిమానమూ ఈ విషయంలో కొరగానిదైపోయిందన్నారు.
 
పార్టీ గెలుపుకోసం పనిచేశానని, ఒకసారి అధికారంలోకి రాగానే కొత్త కొత్త నాయకులు వైసీపీలోకి రావడం మొదలుపెట్టారని రాజమాణిక్యం వాపోయాడు. అనంతరం జేసీ-2 చంద్రమౌళిని కలిసి వినతిపత్రం అందించాడు. 

రాజమాణిక్యంది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె. పట్నం. పుట్టుకతోనే దివ్యాంగుడు కావడంతో, తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి! తొలినుంచీ వైఎస్‌ అంటే అభిమానం. అ అభిమానంతోనే ఆయన చనిపోయినప్పుడు ఇల్లు అమ్మి గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు. వైఎస్‌ కుటుంబంపై అభిమానంతో జగన్‌ సీఎం అయ్యేంత వరకు జుట్టు, గడ్డం తీయకుండా ఆరు సంవత్సరాలపాటు అలాగే ఉన్నాడు.
 

click me!