బుగ్గన బడ్జెట్: ఉద్యోగులకు పెద్దపీట

By narsimha lodeFirst Published Jul 12, 2019, 4:33 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు ఐఆర్‌ను 27 శాతం ఈ ఏడాది జూలై నుండి అందిస్తున్నామని ప్రకటించింది.
 

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు ఐఆర్‌ను 27 శాతం ఈ ఏడాది జూలై నుండి అందిస్తున్నామని ప్రకటించింది.

శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్దీకరించేందుకు మంత్రుల అధ్మయన బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

సీపీఎస్ పెన్షన్ విధానాన్ని మార్చుతామని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సీపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని మార్చేసి కొత్త పెన్షన్ విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేయనున్నట్టు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని  మంత్రి  గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

ఆశా వర్కర్లకు నెల వేతనాన్ని రూ. 3 వేల నుండి రూ. 10 వేలకు పెంచినట్టుు ప్రభుత్వం గుర్తు చేసింది. హోంగార్డుల వేతనాన్ని  రూ. 18 వేల నుండి రూ. 21 వేలకు పెంచినట్టుగా ప్రభుత్వం గుర్తు చేసింది.

 

సంబంధిత వార్తలు

సీఎం స్వంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి భారీ కేటాయింపులు

వ్యవసాయ బడ్జెట్: మత్స్యపరిశ్రమకు అత్యధిక ప్రోత్సాహం

ప్రకృతి విపత్తులకు బడ్జెట్‌లో రూ.2002 కోట్లు: ఏపీ ప్రభుత్వం

ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు: బుగ్గన

బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన

click me!