వైఎస్ కుటుంబం దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు, అన్ని పథకాలకు ఆయన పేరేనా: యనమల సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jul 12, 2019, 4:03 PM IST
Highlights

మరోవైపు ప్రభుత్వ పథకాలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అన్ని పథకాలకు వైయస్ఆర్ పేర్లే పెట్టారని కొన్నింటికి జగన్ పేర్లు కూడా పెట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 40 రోజులకే పథకాలకు తన పేరు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. జగన్ ప్రచారం ఎక్కువ చేసుకుంటారని హంగు ఆర్భాటాలే తప్ప వాస్తవాలు ఏమీ ఉండవంటూ మండిపడ్డారు. వైసీపీ బడ్జెట్ చూస్తుంటే కాకమ్మ కథలను తలపిస్తోందని విరుచుకుపడ్డారు. 

అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ బడ్జెట్ ను చదువుతూ నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పదేపదే మంత్రులు ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. నేను విన్నాను, నేను ఉన్నాను తోపాటు నేను తిన్నాను అని కూడా పెట్టాల్సిందంటూ ధ్వజమెత్తారు. 

అసలు రాష్ట్రానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏం చేసిందో చెప్పాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల ప్రస్తావించారు. రాష్ట్ర ఖజానాను దోచుకుతిన్న కుటుంబం వైయస్ కుటుంబం అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి వారు చేసిందేమీలేదని అందినకాడికి దోచుకుతిన్నారని విరుచుకుపడ్డారు. 

మరోవైపు ప్రభుత్వ పథకాలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అన్ని పథకాలకు వైయస్ఆర్ పేర్లే పెట్టారని కొన్నింటికి జగన్ పేర్లు కూడా పెట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 40 రోజులకే పథకాలకు తన పేరు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. 

మాజీ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ పేరు రెండు మూడు పథకాలకు పెడితే బాగుండేదని దానికి తాను అభ్యంతరం చెప్పడం లేదని ప్రతీ పథకానికి వారి పేర్లు పెట్టడం ఏంటని నిలదీశారు.  మరోవైపు రాష్ట్రంలో అనేకమంది సంఘ సంస్కర్తలు, జాతీయ స్థాయిలో ఎందరో మహానుభావులు ఉన్నారని వారి పేర్లు పెడితే బాగుండేదని యనమల రామకృష్ణుడు విమర్శించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ప్రచారం ఎక్కువ, పస తక్కువ: బడ్జెట్ పై యనమల ఫైర్

click me!