ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు కుదిరిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన తొలి బహిరంగ సభ ఇవాళ జరగనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేటలో ఆదివారం నాడు టీడీపీ,బీజేపీ,జనసేన ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు.
also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కూడ కుదిరింది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాలను విడుదల చేసింది. జనసేన ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో కూడ జనసేన అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత తొలిసారిగా ఈ సభ నిర్వహిస్తున్నారు.ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు.
also read:37 కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవుల భర్తీ: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
2014 ఎన్నికల సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.2019 ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ నుండి టీడీపీ వైదొలిగింది. జనసేన కూడ టీడీపీతో తెగదెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
also read:క్లాస్‌రూమ్‌లో టీచర్ డ్యాన్స్: వీడియో వైరల్
ఈ ఏడాది మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని ఎన్‌డీఏ ఇవాళ్టి సభతో ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దఫా వైఎస్ఆర్‌సీపీని అధికారం నుండి దించి తాము అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.ఈ క్రమంలోనే జనసేన, బీజేపీలతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది.
also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
ఇవాళ చిలకలూరిపేటలో జరిగే సభలో ఈ మూడు పార్టీల నేతలు ఏం చెబుతారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. 2014 ఎన్నికల సమయంలో కూడ మూడు పార్టీలు గుంటూరులో సభ నిర్వహించాయి. ఇప్పుడు కూడ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడి వద్ద సభ నిర్వహించనున్నారు.ఈ సభకు ప్రజా గళంగా నామకరణం చేశారు. సభ ప్రాంగణంలో సుమారు 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
ఈ సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొంటున్నందున బందోబస్తు ఏర్పాట్లను కూడ ఎస్‌పీజీ అధికారులు పర్యవేక్షించారు. ఎస్పీజీ అధికారులు స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు.