
Y. S. Avinash Reddy Biography: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అవినాష్ రెడ్డి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేపింది. ఈ తతంగమంతా తెలుగు సీరియల్ మాదిరిగా నెలల తరబడి సాగుతూనే ఉంది. కాగా.. ఆయన జీవిత, రాజకీయ చరిత్ర తెలుసుకుందాం..
కుటుంబ నేపథ్యం..
వైయస్ రాజారెడ్డి తండ్రి వైయస్ వెంకటరెడ్డి. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు లక్ష్మమ్మ. ఆమె చిన్న కొండారెడ్డి అనే కొడుకు జన్మించాడు. ఆ తర్వాత రెండవ భార్య మంగమ్మ.. ఆమెకు పెద్ద కొండరెడ్డి, సుగుణమ్మ, ప్రభుదాస్ రెడ్డి, రత్నమ్మ, రాజారెడ్డి, పురుషోత్తం రెడ్డి, మేరీ పునీతమ్మ, కమలమ్మ జన్మించారు. మొదటి భార్యకి పుట్టిన చిన్న కొండారెడ్డి కొడుకు పేరు భాస్కర్ రెడ్డి. ఆ భాస్కర్ రెడ్డి కుమారుడే అవినాష్ రెడ్డి.
మరోవైపు.. వైయస్ వెంకటరెడ్డి రెండో భార్య కుమారుడు రాజారెడ్డి. ఆయనకు వైయస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, సుధాకర్ రెడ్డి ,రవీంద్రనాథ్ రెడ్డి అనే నలుగురు కొడుకులు జన్మించారు. వీరిలో చివరివాడు వివేకానంద రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల జన్మించారు ఈ విషయం మనందరికీ తెలిసిందే.. ఆ విధంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లు పెదనాన్న చిన్నాన్న పిల్లలే. అలాగే.. జగన్ కంటే భారతమ్మకి అవినాష్ కి మరీ దగ్గర సంబంధం ఉంది. అవినాష్ రెడ్డి అమ్మగారు, భారతీ తండ్రి గంగిరెడ్డి సొంత అన్నాచెల్లెలు. ఆ విధంగా అటు జగన్తోనూ ఇటు భారతి తోనూ దగ్గర సంబంధం ఉంది.
అవినాష్ రెడ్డి 27 ఆగస్టు 1984న జన్మించారు. ఆయన చెన్నైలోని ఎస్టీ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్ ( MBA) పూర్తి కుటుంబ వ్యాపారాలు చూసుకున్నాడు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మరణంతో సీఎం పదవి కోసం ఆశపడటం అది దక్కకపోవడం కాంగ్రెస్ అధిష్టానం సిబిఐ ద్వారా జగన్ని జైల్లో ఉంచడం జరిగిపోయాయి. ఆ తర్వాత జగన్ పార్టీని పెట్టడం. 2014 ఎన్నికల్లోవైసీపీ పోటీ చేసినా ఓడిపోయింది. అదే సమయంలో కడప ఎంపీగా తమ్ముడు అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. అయితే వివేకానంద రెడ్డి .. మొదట కాంగ్రెస్ లో ఉన్న ఆ తర్వాత కొడుకు పెట్టినటువంటి వైసీపీలో చేరారు. అయితే ఈ కడప ఎంపీ సీటు విషయంలో కూడా వివేకానంద గారికి అవినాష్ కి మధ్య విభేదాలు వచ్చాయని కొన్ని విమర్శలు ఉన్నాయి.
ఆ ఎన్నికల్లో వివాదాన్ని సర్ది చెప్పినా జగన్మోహన్ రెడ్డి.. అవినాష్ కి ఎంపీ సీటు ఇచ్చాడు. అవినాష్ 1,90,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ ఎన్నికల్లో నిజానికి అవినాష్ రెడ్డి జగన్ కి తమ్ముడనే కారణంతో గెలుపొందాడు. వినాష్ రెడ్డి అప్పటికి అవినాష్ రెడ్డి వయసు కేవలం 29 సంవత్సరాల మాత్రమే. 2014లో వైసీపీ అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంతో పాటు ఎంపీగా అవినాష్ రెడ్డి మరోసారి గెలుపొందాడు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య
వైఎస్ వివేకానంద రెడ్డి.. 15 మార్చి 2019న కడపలోని తన నివాసంలో దారుణంగా హత్య చేయబడ్డారు. దొరికిన ఆధారాల మేరుకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన నేరపూరిత కుట్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. గుండెపోటుగా కానీ తర్వాత హత్యగా గుర్తించడం మరింత అనుమానాలకు దారితీసింది . ఈ హత్య 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు జరిగింది. వివేకానంద రెడ్డి హత్యలో భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి కూడా కుట్ర పన్నారని బాధితురాలి కుమార్తె డా.సునీత రెడ్డి ఆరోపిస్తున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డి బయోడేటా..
పూర్తి పేరు: యెదుగూరి సందింటి అవినాష్ రెడ్డి
పుట్టిన తేదీ: 27 ఆగస్టు 1984 (వయస్సు 39)
పుట్టిన ప్రాంతం: పులివెందుల, కడప, ఆంధ్రప్రదేశ్
పార్టీ పేరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
విద్య: సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ( B.Tech ), యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్ ( MBA )
వృత్తి: వ్యవసాయం, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు
తండ్రి : వై,ఎస్. భాస్కర్ రెడ్డి
తల్లి: వై.ఎస్. లక్ష్మీ
జీవిత భాగస్వామి: వై.ఎస్.సమేత
శాశ్వత చిరునామా: 3-9-76, భాకరపురం, పులివెందుల, వైఎస్ఆర్ కడప జిల్లా-516390