ఆర్కే రోజా : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, సినీ, రాజకీయ ప్రస్థానం 

Published : Mar 17, 2024, 07:46 AM IST
ఆర్కే రోజా : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, సినీ, రాజకీయ ప్రస్థానం 

సారాంశం

Roja Biography: నిజ జీవిత కథలు సినిమాలవుతాయి. కానీ, సినిమా కథలు జీవితంగా మారుతాయనే దానికి నిదర్శనం మంత్రి రోజా. ఒకే వ్యక్తి వేరువేరు రంగాల్లో రాణించడం కూడా మంత్రి రోజాకే చెల్లి బాటవుతుంది. తొలుత టీడీపీతో పొలిటికల్ ఏంట్రీ ఇచ్చి.. ఆ తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. వరుసగా రెండుసార్లు  ఎమ్మెల్యేగా విజయం సాధించి జగన్ వెంట నడిచి వైసీపీలో మంత్రిగా కూడా అయ్యారు.  రోజాతో పొలిటికల్ డిబేట్ అంటే ప్రతిపక్ష పార్టీలు జంకుతాయి. అలనాటి తార ఏపీ మంత్రి రోజా సెల్వమణి సినీ, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం..  

Roja Biography:  
 

రోజా బాల్యం, విద్యాభ్యాసం 

ఆర్కే రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు చిత్తూరు జిల్లా బాకరావుపేటలో జన్మించారు. రోజాకి ఇద్దరు అన్నయ్యలు. ఈమె తండ్రి నాగరాజు గారు సారథి స్టూడియోలో పనిచేసేవారు. అందువలన వీరి కుటుంబం హైదరాబాదులోనే ఉండేది. కానీ, రోజూ తిరుపతిలోనే ఉంటూ.. పద్మాలయ మహిళ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 

సినీ జీవితం 

రోజా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టిడిపి ఎంపీ శివప్రసాద్ ప్రేమ తప్పస్పు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ కి జోడిగా రోజాను సెలెక్ట్ చేశారు. వాస్తవానికి రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన నాన్నగారికి విషయం చెప్పారు.  వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దనీ,  ఒక్క సినిమా చేయంటూ తన తండ్రి  రిక్వెస్ట్ చేశారట. ఇలా తండ్రి మాటకు ఎదురు చెప్పలేక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా సమయంలోనే ఛాంబర్తి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ కోసం తమిళ దర్శకుడు సెల్వమని రోజాను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 

రోజా నటించిన సినిమాలు మంచి హిట్ కావడంతో అటు తమిళం, ఇటు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, భైరవద్వీపం లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. కెరీర్ లో సెట్ కావాలనే ఉద్దేశంతో ఆమె తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. మొత్తానికి పది సంవత్సరాల్లో మూడు షిఫ్ట్ లు చేస్తూ 100 సినిమాల్లో నటించారు.  ఇలా తమిళంలోనూ.. తెలుగులోనూ టాప్ హీరోయిన్గా ఎదిగారు. ఇలా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన రోజా.. 2002 ఆగస్టు10న అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీనివాసుడు సన్నిధిలో సెల్వమనిని వివాహం చేసుకున్నారు.  వీరికి ఒక పాప అనుషమాలిక, బాబు కృష్ణ కౌశిక్. 

రాజకీయ జీవితం

1999లో తన సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ .. తిరుపతిలో టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయడంతో రోజాని ప్రచారానికి రమ్మన్నారు. ఆమె సరే కొత్తగా ఉంటుందని ఆయనతో పాటు  వెళ్లి ప్రచారం నిర్వహించింది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో రోజాను పిలిచి.. నీలాంటి అమ్మాయి తెలుగుదేశం పార్టీకి అవసరమని ఆహ్వానించారు.  2004లో నగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. ఇలా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

2004 ఎన్నికల్లో ఆమె నగరి నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో జంగారెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా ఆ ఓటమితో ఆమె బాధపడకుండా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శస్త్రాలను సంధించేది. ఇలా  తెలుగుదేశంలో నటి  రోజా ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. అయితే 2009లో నగరి నుంచి కాకుండా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నారు చంద్రబాబు.  

టీడీపీకి వీడ్కోలు

తన సొంత నియోజకవర్గ ప్రజల కోసం 2004 నుంచి 29 వరకు పోరాడితే చంద్రగిరి నుంచి పోటీ చేయడం వలన తెలుగుదేశం నాయకులు కూడా తనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. తెలుగుదేశం నాయకులు పద్ధతి,  చంద్రబాబు వైఖరి నచ్చక టిడిపి నుంచి బయటికి వచ్చేసారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని సంప్రదించి కాంగ్రెస్ లో అడుగుపెట్టారు. కానీ, 2009లో వైఎస్ మరణించడంతో ఒకటిన్నర రెండు సంవత్సరం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకున్నారు.


 
వైసీపీలోకి ఏంట్రీ

2011లో వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో వైసీపీలోకి ఏంట్రీ ఇచ్చారు రోజా. జగన్తో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే వైసీపీలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగారు. 2014లో నగరి నియోజకవర్గ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద గెలుపొందారు. కానీ. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 67 సీట్లు రావడంతో జగన్ సీఎం కాలేకపోయారు. దీంతో తెలుగుదేశం నాయకులు రోజాది ఐరన్ లెగ్ అని,  ఆంటీ అని తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  ఇది సహించలేని ఆమె కోపంతో అసెంబ్లీలో తెలుగుదేశం నాయకుల మీద దీటుగా విమర్శించి టిడిపి నాయకులకి తన కాలుని చూపించింది. 

2019 మే నెలలో రెండవసారి నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.  రోజా తన నియోజకవర్గ ప్రజలకు నగరిలో తన సొంత డబ్బులతో నాలుగు రూపాయలకే భోజనం ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్య ల పరిష్కారానికి క్రుషి చేస్తున్నారు. మరోవైపు.. మహాలక్ష్మితో యాంకర్ గా టీవీ రంగంలో అడుగుపెట్టిన ఆమె జబర్దస్త్ , రంగస్థలం, బతుకు జట్కా వంటి ప్రోగామ్స్ కు జడ్జ్ గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్