తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

By narsimha lodeFirst Published Sep 23, 2018, 4:44 PM IST
Highlights

తొలుత మాజీ ఎమ్మెల్యే సివిరిసోమను కాల్చి చంపిన తర్వాత అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు.


అరకు: తొలుత మాజీ ఎమ్మెల్యే సివిరిసోమను కాల్చి చంపిన తర్వాత అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సోమ వ్యవహారశైలి పట్ల మావోయిస్టులు గుర్రుగా ఉన్నారు. ఎన్‌కౌంటర్లకు సోమ కారణమని మావోయిస్టులు ఆరోపించారని సమాచారం.

అరకు నియోజకవర్గపరిధిలోని డుబ్రీగుంట మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద  మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ ఆదివారం నాడు మరణించారు.

లిప్పిట్టిపుట్టు గ్రామ సమీపంలోకి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాహనం రాగానే ముందుగా మావోయిస్టులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అయితే సర్వేశ్వరరావును మావోయిస్టులు చుట్టుముట్టిన విషయాన్ని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ తన వాహనాన్ని వెనక్కు తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు.

అయితే సోమ వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్టారు. పారిపోయే ప్రయత్నం చేస్తే  బాంబులతో వాహానాన్ని పేల్చేస్తామని, ఎన్ కౌంటర్ చేస్తామని హెచ్చరించారు. దీంతో కారులో నుండి సోమ ఎవరని ఆరా తీసి అతడిని చేతులు వెనక్కు కట్టి మావోలు తీసుకెళ్లారు.

సోమ కంటే ముందుగానే  సర్వేశ్వరరావును మావోలు తమ అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్దరిని ఒకే చోటకు తీసుకెళ్లారు.  ఎన్ కౌంటర్ల విషయమై సోమను ప్రశ్నించారు. ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్ విషయమై సోమను ప్రశ్నించారు. 2009లో సోమ ఎమ్మెల్యేగా  అరకు నుండి ప్రాతినిథ్యం వహించారు.  ఆ సమయంలో వ్యవహరించిన తీరుపై సోమ తీరుపై మావోలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మావోలకు సోమ వివరణ ఇచ్చారు. అయినా కూడ వారు సంతృప్తి చెందలేదు. సోమను మావోలు కాల్చిచంపారు. ఈ ఘటన జరిగిన తర్వాత సర్వేశ్వరరావు మావోలను బతిమిలాడారు. కానీ సర్వేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మావోలు కనికరించలేదు. సర్వేశ్వరరావుపై మావోలు కాల్పులు జరిపారు.దీంతో అతను కూడ అక్కడికక్కడే మరణించాడు.


సంబంధిత వార్తలు

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

పబ్లిసిటీ కోసమే మావోలు ఎమ్మెల్యేను చంపారు: రిటైర్డ్ ఐపీఎస్

click me!