కాల్పులు మావోయిస్టు మహిళాదళం పనేనా...

By Nagaraju TFirst Published 23, Sep 2018, 4:38 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమపై కాల్పులకు తెగబడింది మావోయిస్టు మహిళా దళం పనేనని తెలుస్తోంది. ఈ దాడులలో దాదాపు 50 మంది మావోయిస్టులు పాల్గొనగా అందులో 50 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ మావోయిస్టు మహిళా దళం ఇటీవలే ఏర్పడినట్లు తెలుస్తోంది. 

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమపై కాల్పులకు తెగబడింది మావోయిస్టు మహిళా దళం పనేనని తెలుస్తోంది. ఈ దాడులలో దాదాపు 50 మంది మావోయిస్టులు పాల్గొనగా అందులో 50 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ మావోయిస్టు మహిళా దళం ఇటీవలే ఏర్పడినట్లు తెలుస్తోంది. 

రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్టులు తమ సహచరులను కోల్పోవడంతో ఏడాది కాలంగా ఏవోబీ స్పెషల్ జోన్ లో రిక్రూట్మెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్మెంట్ లో దాదాపు 100 మందికి పైగా మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అయితే వీరంతా అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. మహిళా మావోయిస్టులు నిత్యం ఏజెన్సీలో తిరుగుతూ ప్రజాప్రతినిధుల సమావేశాలు పర్యటనలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

రెండు నెలలుగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పర్యటనలపై దృష్టిసారించిన మావోయిస్టులు పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం దాడులకు పాల్పడ్డారు. డుంబ్రీగూడ మండలం తోటంగి పంచాయితీ లిప్పిటిపుట్ట వద్ద ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడులలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మావోయిస్టు మహిళా దళం ఏర్పడినట్లు తెలుస్తోంది. గతంలో మాజీమంత్రి మణికుమారి భర్త వెంకటరాజును హతమార్చడంలో మహిళా మావోయిస్టులు కీలక పాత్ర పోషించారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

Last Updated 23, Sep 2018, 4:45 PM IST