200 మంది పెయిడ్ బౌన్సర్లు, 400 మంది వాలంటీర్లు.. లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

By team teluguFirst Published Jan 28, 2023, 1:42 PM IST
Highlights

లోకేష్ పాదయాత్ర కోసం టీడీపీ అన్ని ఏర్పాట్టు సిద్ధం చేసింది. ఆయన పాదయాత్ర బందోబస్తు కోసం పోలీసులపై పార్టీ ఆధారపడలేదు. 200 మంది పెయిడ్ బౌన్సర్లు, 400 మంది వాలంటరీలను నియమించారు. 

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 4000 కిలోమీటర్ల యువ గళం పాదయాత్ర ప్రారంభమైంది. 400 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసే భోజనం, వసతి, సోషల్‌ మీడియా, బహిరంగ సభల ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 200 మంది పెయిడ్ బౌన్సర్లు, ప్రత్యేక కారవాన్ వాహనం, 400 మంది వాలంటీర్లను నియమించారు.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం.. ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు..

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వస్థలమైన కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు చారిత్రాత్మక వరదరాజ స్వామి ఆలయంలో లోకేష్, ఇతర నాయకులు పూజలు చేసిన తర్వాత యాత్ర మొదలైంది. అయితే రాష్ట్రంలో గతంలో జరిగిన ఇతర నేతల పాదయాత్రల మాదిరిగా కాకుండా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మోడల్ గా తీసుకొని ఇది కొనసాగనుంది. అందులో భాగంగా లోకేష్ వెళ్లే పలు చోట్ల బహిరంగ సభలు, ఇతర ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నిర్ణయించింది.

తారకరత్న హెల్త్ అప్‌డేట్.. బ్లీడింగ్ నియంత్రణకు శ్రమిస్తున్న వైద్యులు.. ఎక్మో సాయంతో చికిత్స..!

టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో లోకేశ్ పాదయాత్ర శుక్రవారం నిర్వహించారు. అంతకు ముందు ఆయన స్థానిక మసీదు, చర్చిలో ప్రార్థనలు చేసి కుప్పంలోని ఎన్టీఆర్, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే టీడీపీ బందోబస్తు కోసం పోలీసులపై ఆధారపడలేదు. తమ అవసరాలు తీర్చుకోవడానికి బౌన్సర్లు, వాలంటీర్లను రంగంలోకి దింపింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం.. అసలేం జరిగిందంటే..

కాగా.. యాత్ర ప్రారంభించిన కొద్ది నిమిషాలకే, సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారక రత్న మసీదు వెలుపల కుప్పకూలారు. దీంతో వాలంటీర్లు, బౌన్సర్లు, రోడ్డుపై విస్తరించి ఉన్న భారీ జనాలను పక్కకు తప్పిస్తూ ఆయనను హాస్పిటల్ కు తరలించారు. కుప్పం నుంచి ఒడిశా సరిహద్దుల్లోని ఇచ్ఛాపురం వరకు జరిగిన తొలి విడత యాత్రలో లోకేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కుప్పం పట్టణం టీడీపీ జెండాలు, బోర్డులతో మార్మోగింది. శుక్రవారం ఎనిమిది కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో పాల్గొనేందుకు వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు కుప్పంకు చేరుకున్నారు.

ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ.. తమిళనాట బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నారా..?

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పోరాడేందుకు యువత తన యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  అయితే బహిరంగ సభకు టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు హాజరుకాకపోవడం గమనార్హం. లోకేష్ మామగారు నందమూరి బాలకృష్ణ కుప్పంలో యాత్రలో పాల్గొన్నారు. అయితే గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నను పరామర్శించేందుకు బాలకృష్ణ ఆసుపత్రికి వెళ్లారు. 

click me!