పవన్ కల్యాణ్ ఫస్ట్ ఆప్షన్‌కే కట్టుబడి ఉన్నాం.. పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ క్లారిటీ..

Published : Jan 28, 2023, 01:36 PM IST
పవన్ కల్యాణ్ ఫస్ట్ ఆప్షన్‌కే కట్టుబడి  ఉన్నాం.. పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ క్లారిటీ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కీలక సమావేశాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. జనసేన-బీజేపీ పొత్తుపై అనుమానాలు ఎందుకని  ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కీలక సమావేశాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. జనసేన-బీజేపీ పొత్తుపై అనుమానాలు ఎందుకని  ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పిన మొదటి ఆప్షన్‌‌కే కట్టుబడే ఉన్నామని చెప్పారు. బీజేపీతో కలిసే ఉన్నామని, కలిసే వెళ్తామని పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు. తాము ఇక్కడ బెస్ట్ పార్టీ అని అన్నారు. తాము రెండో ఆప్షన్ కాబోమని చెప్పారు. తాము మొదట అనుకున్నదే చేస్తామని.. అదే సాధ్యమయ్యేలా  చూస్తామని తెలిపారు. 

తాము కామన్ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని  చెప్పారు. ప్రతి  రోజు సమావేశం కావాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే ఐదు నిమిషాల్లో కలుస్తామని చెప్పారు. టీటీడీలో హిందూ వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని మండిపడ్డారు. టీటీడీలో జరుగుతున్న కుట్రల వెనక అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు