ఈ ఏడు మార్గాలతో.. దేశీయ వ్యవసా రంగంలో సమూల మార్పులు.. ప్రధాని మోడీ..

By SumaBala BukkaFirst Published Feb 25, 2022, 1:38 PM IST
Highlights

భారతీయ వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చే పథకాలకు దేశీయ స్టార్టప్ లు శ్రీకారం చుట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికోసం ఏడు మార్గాల ద్వారా ప్రయత్నించాలని సూచించారు. 

న్యూఢిల్లీ : స్టార్టప్‌లు, బ్యాంకింగ్ రంగం, పెట్టుబడిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సహకార సంస్థల సహాయంతో వ్యవసాయ రంగానికి 2022-23 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలను రూపొందించి, అమలు చేయడం ప్రారంభించాలని policymakers, stakeholdersకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విజ్ఞప్తి చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, భారతదేశంలో వ్యవసాయాన్ని "ఆధునికంగా, స్మార్ట్"గా మార్చే "ఏడు మార్గాల"పై మాట్లాడారు.

ఈ ఏడు మార్గాలలో మిషన్ మోడ్‌లో natural farming, AI, డ్రోన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, edible oils దిగుమతిని తగ్గించడానికి మిషన్ ఆయిల్ పామ్, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం కొత్త లాజిస్టిక్స్, వ్యవసాయ-వ్యర్థాల నిర్వహణ, ఉపయోగం. రైతులకు సాధారణ బ్యాంకింగ్ సేవలు, వ్యవసాయ పరిశోధన, విద్యను అందించడానికి 1.5 లక్షల పోస్టాఫీసులను ఏర్పాటు చేయడం లాంటివి ఉన్నాయి.

Latest Videos

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ‘Smart Agriculture' అనే వెబ్‌నార్‌లో ప్రసంగించారు. ఈ సమయంలో భారతీయ వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే ఈ ఏడు మార్గాలను చెప్పుకొచ్చారు. ఇవి 2022-23 బడ్జెట్ వ్యవసాయ పరివర్తనకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశ పెట్టిన 'income support scheme', PM కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) స్కీంలు ప్రవేశపెట్టి మూడేళ్లు గడిచిన సందర్బంగా జరిగిన వెబినార్ ఇది. ఈ  వెబ్‌నార్‌కు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆయన మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

PM-Kisan పథకం కింద గురువారంనాటికి సుమారు 11.78 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఫిబ్రవరి 24, 2019 నుండి దేశవ్యాప్తంగా వివిధ వాయిదాలలో రూ. 1.82 లక్షల కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయి. ఇందులో రూ.1.29 లక్షల కోట్లు ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో విడుదల చేశారు. ఈ పథకం కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) విధానంలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతీ భూస్వామి, రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా సంవత్సరానికి మూడు సమాన వాయిదాలలో రూ.6,000 బదిలీ చేయబడుతుంది. దేశంలో ఇలాంటి రైతులు దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు.

"ఈ పథకం దేశంలోని చిన్న రైతులకు బలమైన మద్దతుగా మారింది" అని ప్రధాని అన్నారు. విత్తనం నుండి మార్కెట్ వరకు విస్తరించి ఉన్న అనేక కొత్త వ్యవస్థల గురించి, వ్యవసాయ రంగంలో గత ఏడేళ్లలో పాత వ్యవస్థలలో సంస్కరణల గురించి కూడా ఆయన మాట్లాడారు. “కేవలం ఆరేళ్లలో వ్యవసాయ బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచాం. గత ఏడేళ్లలో రైతులకు వ్యవసాయ రుణాలు కూడా రెండున్నర రెట్లు పెరిగాయి” అని ఆయన చెప్పారు.

2023 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం'గా గుర్తించిన మోదీ, దేశీయ తృణధాన్యాలను బ్రాండింగ్ చేయడంలో, ప్రోత్సహించడంలో కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతీయ తృణధాన్యాల నాణ్యత, ప్రయోజనాలను ప్రాచుర్యం పొందేందుకు సెమినార్లు, ఇతర ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని విదేశాల్లోని ప్రధాన భారతీయ మిషన్లను ఆయన కోరారు.

పర్యావరణ అనుకూల జీవనశైలి పట్ల అవగాహన పెంచుకోవాలని, సహజ, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్‌ను పెంచాలని కూడా ప్రధాన మంత్రి కోరారు. 'కృషి విజ్ఞాన కేంద్రాలు' (కెవికె) ప్రమోషన్ కోసం ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరేళ్ల క్రితం రూ.2 వేల కోట్లు ఉన్న ఎగుమతులు ప్రస్తుతం రూ.7 వేల కోట్లకు పెరిగి.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ రూ.11,000 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు.

భారతదేశంలో భూసార పరీక్షలు చేయించే అలవాటు పెంచాల్సిన అవసరాన్ని కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. 'సాయిల్ హెల్త్ కార్డ్స్'పై ప్రభుత్వ దృష్టిని ఎత్తిచూపుతూ, నిర్ణీత వ్యవధిలో భూసార పరీక్షల అభ్యాసాన్ని సులభతరం చేయడానికి స్టార్టప్‌లు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ) పూర్తిగా మార్చబోతోందని మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరగడం ఈ మార్పులో భాగమే అన్నారు. “అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడు మాత్రమే డ్రోన్ టెక్నాలజీ ఓ స్థాయిలో అందుబాటులో ఉంటుంది. గత మూడు-నాలుగేళ్లలో దేశంలో 700కు పైగా అగ్రి స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయన్నారు. 

వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం మీద అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. పంట రక్షణ కోసం, పురుగుమందులను చల్లడానికి, మట్టిని పిచికారీ చేయడానికి ఇలాంటి మానవరహిత వైమానిక వాహనాల (UAVs) వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOPs) విడుదల చేసింది. ఇందులో SOPలు ఉపయోగం, అత్యవసర నిర్వహణ ప్రణాళిక కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలు ఇందులో ఉంటాయి. 

పురుగుమందులు చల్లడానికి డ్రోన్లు వాడాలనుకుంటే.. అలాంటి డ్రోన్ నియంత్రణ కోసం SOPల్లో చట్టబద్ధమైన నిబంధనలు, విమానయాన అనుమతులు, దూర ప్రాంత పరిమితులు, బరువు వర్గీకరణ, రద్దీగా ఉండే ప్రాంతాల పరిమితి, డ్రోన్ రిజిస్ట్రేషన్, భద్రతా బీమా, పైలటింగ్ ధృవీకరణ, ఆపరేషన్ ప్లాన్, ఎయిర్-ఫ్లైట్ జోన్‌లు, వాతావరణ పరిస్థితులు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తాయి.

డ్రోన్‌ల ప్రభావవంతమైన, సురక్షితమైన కార్యకలాపాల కోసం ఈ రంగంలోని అన్నిరకాల వాటాదారులతో సంప్రదించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ దీనిని తయారు చేసింది. జాతీయ డ్రోన్ విధానం, డ్రోన్ రూల్స్ 2021 ఇప్పటికే దేశంలోని వ్యక్తులు, కంపెనీలు డ్రోన్‌లను వాడేలా, స్వయంగా ఆపరేట్ చేయడాన్ని సులభతరం చేశాయి. 2020లో వివిధ రాష్ట్రాల్లో మిడతల దాడులను అరికట్టడంలో దేశంలోనే తొలిసారిగా డ్రోన్‌లను ఉపయోగించారు.

click me!