Organic Farming: సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి? ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

By Mahesh RajamoniFirst Published Feb 25, 2022, 2:54 PM IST
Highlights

Organic Farming: సేంద్రీయ వ్యవసాయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పంటను పండించడంలో తగిన సూచనలు, పద్దతులు, మెలకువలు తెలుసుకున్నప్పుడే పంట దిగుబడి బాగుంటుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. 
 

Organic Farming: సంప్రదాయ పద్దతిలో.. కేవలం సహజ వనరులను ఉపయోగించే వ్యవసాయం చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను గానీ, కలుపు మందులను గానీ, పరుగు మందులను గానీ వాడకూడదు. ఈ పద్దతిలో  కృత్రిమ వనరులను మొత్తానికే వినియోగించకూడదు. 

అయితే 1965-2000 మధ్య కాలంలో పురుగు మందుల వాడకం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. అధిక దిగుబడి, అధిక లాభాల పేరుతో వీటిని విచ్చల విడిగా ఉపయోగించేవారు. దీని వల్ల ఫ్యూచర్ లో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా.. ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వీటి వాడకం వల్ల ఎన్నిసత్పలితాలు వచ్చాయో.. అంతకు మించి దుష్పలితాలను చవి చూసారు. చూస్తూనే ఉన్నారు. మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి, పండే పంట పూర్తిగా కలుషిత మయమయ్యాయి. 

Latest Videos

అందులోనూ విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూ సారం పూర్తిగా దెబ్బతింటుంది. వీటిని ఎక్కువగా వాడటం వల్ల కొన్నేళ్ల తర్వాత ఆ పొలంలో చిన్నకలుపు మొక్క కూడా పెరగదని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వీటి మూలంగానే భూ కాలుష్యం, నీటి కాలుష్యాలు బాగా పెరిగాయి. ఇక విచ్చల విడిగా పురుగుల మందు వాడకంతో వాతావరణ కాలుష్యం పెరిగింది. కలుషిత నీరు, కలుషిత గాలి, కలుషిత తిండితో మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు వీటితో ఈ భూమిపై ఉండే ఎన్నో జీవులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. 

ముఖ్యంగా భూసారాన్ని పెంచే వానపాములు పూర్తిగా అంతరించి పోయే స్టేజిలో ఉన్నాయి. తేనె టీగలు కూడా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొందమంది రైతులు ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ.. తక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఈ సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో దిగుబడులు తక్కువొచ్చిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.

సేంద్రీయ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అంశాలు, జాగ్రత్తలు: 

సహజ వనరులు మెండుగా లభించినా.. ఎప్పటి కప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు, నేల, నీరు కాలుష్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పంట సరిగ్గా రాదు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే మార్గాలను కనుక్కోవాలి. ఇందుకోసం జీవన ఎరువులు, అన్ని రకాల సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలి. 

ఒకవేళ పంటకు నష్టం కలిగించే తెగులు, క్రిమికీటకాలు దాడి చేసినప్పుడు వాటికి జీవ సంబంధ పదార్థాలు లేదా వృక్ష సనంద పదార్థాలతో వాటికి తరిమికొట్టుచ్చు. 

పంట ప్రతి దశలో యాజమాన్య పద్దతలును ఉపయోగిస్తే దిగుబడి పెరిగే అవకాశముంటుంటుంది. 

కోడి పెంట, ఆవు గేదెల పేడ,  మేక ఎరువులు, వామి కంపోస్టు, పచ్చి ఆకు ఎరువులు, పంది పెంట, చెరకు మద్ది వంటి ఎరువులను ఎక్కువగా వాడితే పంట దిగుబడి బాగుంటుంది.  

click me!