KTR On Sports Policy: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించాలని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదని, క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. క్రీడారంగంలో సమగ్ర అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.