తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కొత్త ఇల్లు ఫోటోలు, లోపల లుక్ అదిరిపోయింది
తమన్నా భాటియా మాజీ ప్రియుడు విజయ్ వర్మ ముంబైలో సముద్రం కనిపించే విధంగా ఒక కొత్త ఇల్లు కొన్నారు. తన విలాసవంతమైన ఇంటి లోపలి ఫోటోలను కూడా పంచుకున్నారు. విజయ్ ఇంటి లోపలి ఫోటోలు మీరూ చూసేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
లగ్జరీ హౌజ్ కొనుగోలు చేసిన విజయ్ వర్మ
తమన్నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ అదిరిపోయే కొత్త ఇల్లు కొన్నారు. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను ఫరా ఖాన్ తన వ్లాగ్‌లో పంచుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత విజయ్ ఇలాంటి లగ్జరీ హౌజ్‌ని కొనుగోలు చేయడం విశేషం.
సముద్ర కనిపించేలా వ్యూ అదిరిపోయింది
విజయ్ వర్మ ఇల్లు సముద్రం వైపు ఉంది. డ్రాయింగ్ రూమ్‌లో పెద్ద గాజు కిటికీ ఉంది, దాని ద్వారా సముద్రం కనిపిస్తుంది. వ్యూ చూడ్డానికి అదిరిపోయింది.
డైనింగ్ హాల్ స్పెషల్ ఎట్రాక్షన్
విజయ్ వర్మ కొత్త ఇంటి డైనింగ్ హాల్ చూడ్డానికి చాలా బాగుంది. డైనింగ్ టేబుల్‌తో పాటు రూఫ్‌పై మంచి లైటింగ్ ఉంది. కొన్ని పచ్చటి మొక్కలను కూడా అలంకరించారు. ఇది స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
విశాలమైన హాల్ హాయి ఫీలింగ్
విజయ్ వర్మ తన ఇంటి హాల్ చాలా విశాలంగా ఉంది. సోఫాల్, టీవీ, పలు డిజైన్స్ తో కనువిందుగా ఉంది. పెద్ద వాల్ సోఫా, సెంటర్ లో గాజు టేబుల్ కూడా ఉంది. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది.
కిచెన్‌లోనూ అదిరిపోయే వ్యూ
విజయ్ వర్మ కొత్త ఇంటి కిచెన్ పెద్దదిగా లేదుగానీ, కిచెన్‌లో కూడా పెద్ద గాజు కిటికీ ఉంది, దాని ద్వారా బయటకు చూడొచ్చు. అక్కడి వ్యూ కూడా చాలా బాగుంది.
సింపుల్‌గా బెడ్ రూమ్
విజయ్ వర్మ బెడ్‌రూమ్ చాలా సింపుల్‌గా ఉంది. ఈ రూమ్ బాల్కనీకి కనెక్ట్ చేసి ఉంది. బెడ్ రూమ్‌ని సింపుల్‌గానే ఉంది. ఇందులో పెద్దగా హడావుడి లేదు. ఒక ప్రశాంతమైన ఫీలింగ్ తెప్పించేలా ప్లజెంట్‌గా ఉండటం విశేషం.
విజయ్ వర్మ కొత్త ఇంటిని సందర్శించిన ఫరా ఖాన్
బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్.. విజయ్ వర్మ కొత్త ఇంటిని చూడటానికి వచ్చారు. విజయ్ ఇంటిని చూసి ఆమె చాలా సంతోషించారు. అనంతరం ఇంటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.
విజయ్ వర్మ, తమన్నా ఒకప్పుడు ప్రేమించుకున్నారు, కలిసి డేటింగ్ చేశారు. కానీ ఇటీవలే వీరిద్దరు బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తుంది. వీరిద్దరు విడివిడిగానే కనిపిస్తున్నారు.