Video news : పిచ్చి వాగుడు మానుకొకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది
మైలవరం మార్కెట్ యార్డు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిశాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు ప్రారంభించారు.
మైలవరం మార్కెట్ యార్డు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిశాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత పాలకులు మాదిరిగా రైతులను మోసం చేయడం కాకుండా అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండటమే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి అశయమని తెలిపారు. ఎమ్మెల్యే గా మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గడిచిన పదేళ్ళ లో రైతులకు చేసిందేమీ లేదని 6 నెలల్లో మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని పిచ్చి వాగుడు మానుకొకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని అన్నారు.