Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో దాడి... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్ర స్పందించారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్ర స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అధికార వైసిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని... అందువల్లే అసెంబ్లీ రౌడీల్లా వ్యవహరించారని అన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై దాడి అత్యంత హేయమైన చర్య... సీఎం జగన్ దగ్గరుండిమరీ ఇలా దళితులపై దాడులు చేయించడం దారుణమని అన్నారు. దళితుల ఓట్లతో గెలిచిన జగన్ ఇప్పుడు వారిపైనే దాడులు చేయిస్తున్నారని... ప్రజాస్వామ్య వాదులంతా ఎమ్మెల్యేల మీద జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండించాలని రవీంద్ర సూచించారు. రాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో అనుభవం కలిగిన సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై అసెంబ్లీలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి దురుసుగా ప్రవర్శించారని అన్నారు. ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సాక్షిగా దాడి జరిగిన ఈ రోజు చరిత్రలో చీకటి దినంగా మిగిలిపోతుందని కొల్లు రవీంద్ర అన్నారు. 

Video Top Stories