Asianet News TeluguAsianet News Telugu

గుట్టుచప్పుడు కాకుండా... ఆర్టీసీ బస్సులో మద్యం బాటిళ్లు..

కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 

First Published Jul 7, 2020, 11:38 AM IST | Last Updated Jul 7, 2020, 11:38 AM IST

కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. తిరువూరు డిపో బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో మద్యం తీసుకెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు బైపాస్ లో బస్సును నిలిపి తనిఖీ చేపట్టారు.  పది మద్యం ఫుల్ బాటిళ్లు మాన్షన్ హౌస్ ఉన్నట్లు గుర్తించామని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకుపోయారు. దీంతో వారిద్దరు రిజర్వేషన్ ద్వారా బస్సు  ఎక్కరా, లేకా టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. వారు ఎప్పటినుండి ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు..అనే విషయంపై బస్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.