TFI Fans Cricket: తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఈగల్పై తమ్ముడు ఎలెవన్ ఘన విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో తమ్ముడు ఎలెవన్ కేవలం 5.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ ఈగల్పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.