తెలంగాణలో బోనాల సందడి మొదలయ్యింది. ఈ ఆషాడమాసం మొత్తం తెలంగాణ పల్లెలతో పాటు హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతాయి. నేడు గోల్కొండ కోటలో బోనాల సందడి ఉంటుంది.
హైదరాబాద్ ఆషాడ బోనాల కోసం సర్వం సిద్దమయ్యింది. తెెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ మొత్తం బోనాాల వేడుకల్లో సందడి చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే మంత్రుల షెడ్యూల్ ఖరారయ్యింది.
భాగ్యనగరం బోనమెత్తింది. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర వైభవంగా సాగుతుంది. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ : ఆషాడమాస బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు పిల్లాపాపలతో తరలివస్తున్న భక్తులతో సికింద్రాబాద్ ప్రాంతం సందడిగా మారింది.