మార్కెట్లోకి పెద్ద ఎత్తున నకిలీ నోట్లు సర్క్యూలేట్ అవుతోన్నట్లు ఇటీవల అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రూ. 500 నకిలీ నోట్లను మార్కెట్లోకి వదులుతున్నారు. బ్యాంకులకు చేరే వరకు ఈ విషయం తెలియడం లేదు. అసలైన రూ. 500 నోట్లను పోలినట్లు డిజైన్ చేయడంతో గుర్తించడం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఫేక్ నోట్లను గుర్తించేందుకు వీలుగా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది ఆర్బీఐ.